Devara: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు కొర టాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్‌రామ్, కె. హరి కృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘దేవర’ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జాన్వీకి తెలుగులో ఇది తొలి చిత్రం. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లుగా సినిమా స్టార్టింగ్‌లోనే ప్రకటించారు మేకర్స్. సినిమా రెండు భాగాలుగా రానున్న నేపథ్యంలో తొలిభాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు చెప్పారు ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ. అయితే ‘దేవర’ సినిమా విడుదలను గురించి తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో విభిన్నమైన గ్యాసిప్స్ వినిపిస్తున్నాయి. ‘దేవర’ సినిమా విడుదల వాయిదా పడిందనేది ఈ గ్యాసిప్ల సారాంశం.
భారీ బడ్జెట్‌తో ‘దేవర’
‘దేవర’ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. భారీ భారీ సెట్స్‌ను భారీ బడ్జెట్ నిర్మించారు. ముందు ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలను తీశారు. కెన్నీ బెట్స్ వంటి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. అయితే ఇప్పుడు సడన్‌గా ‘దేవర’ సినిమా వాయిదా అనే టాక్ తెరపైకి వచ్చింది. ఇందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.
డల్ బిజినెస్?
భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కానీ ఈ బడ్జెట్‌కు తగ్గ బిజినెస్ కావడం లేదని, ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ సినిమాను పాతికకోట్ల రూపాలయకే బయ్యర్స్ అడుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్లో ఎన్టీఆర్‌కు బెస్ట్ రికార్డు ఉన్న సినిమా ‘అరవిందసమేత వీరరాఘవ’. ఈ సినిమా ఓవర్సీస్లో 2.5 మిలియన్ డాలర్స్‌ను కూడా వసూలు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పాతికకోట్ల రూపాలయకు అడుగుతున్నారట ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘దేవర’ సినిమాకు టీమ్ ఆశించినంద బిజినెస్ కావడం లేదట. ఇందుకు కారణం..దర్శకుడు కొరటాల శివ తీసిన గత చిత్రం ‘ఆచార్య’ డిజాస్టర్‌గా నిలవడమేనన్నది ట్రేడ్ పండితులు చెబుతున్న ఓ ఉదాహరణ. అలాగే ఇప్పటికే ‘దేవర’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇది 155కోట్ల రూపాయల డీల్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నమాట.
పెండింగ్ వీఎఫ్క్స్ వర్క్
కేవలం బిజినెస్ మాత్రమే కాదు…భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండటం అనేది ‘దేవర’ రిలీజ్ ఆలస్యమవ్వడానికి ఓ కారణం అని, షూటింగ్ కూడా ఇంకా చేయాల్సి ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లో వస్తే, ఈ ప్రభావం సినిమాలపై పడుతుంది. ‘దేవర’ వాయిదాకు ఇది కూడా ఓ కారణం కావొచ్చు. అసలు..ఈ గందరగోళమంతా సమసిపోవాలంటే ‘దేవర’ సినిమా టీమ్ అధికారికంగా ఓ ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ వంటి హిట్ ఫిల్మ్ వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.