Tollywood: రాజమౌళి దర్శకత్వంలోని ‘బాహుబలి’ సినిమా ఇండియన్ సినిమాను క్వాలిటీ, స్టాండర్ట్స్, మేకింగ్, మార్కెట్ ..ఇలా అన్ని రకాలుగా నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళ్లింది. Tollywood పాన్ ఇండియా అనే ఓ కొత్త పదాన్నితెచ్చిపెట్టింది. అయితే ‘బాహుబలి’ సినిమాలో హీరోగా చేసిన ప్రభాస్, ఇందులో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడు. తండ్రి అమరేంద్రబాహుబలి, కొడుకు మహేంద్రబాహుబలిగా ‘బాహుబలి’ సినిమాలో కనిపిస్తాడు ప్రభాస్. రెండు భాగాలుగా సినిమా విడుదలైంది. తొలిపార్టులో కొడుకు శివుడు ఆలియాస్ మహేంద్రబాహుబలి పాత్ర పరిచయం, ప్రస్తానం, లక్ష్యం నిర్ధేశించబడతాయి. సెకండాఫ్‌లో తండ్రీ పాత్ర అమరేంద్రబాహుబలి సక్సెస్‌స్టోరీ, వెన్నుపోటుతో చావడం తో పాటు, క్లైమాక్స్‌లో తండ్రీ చావుకు కొడుకు ప్రతీకారం తీర్చుకోవడం ఇలా సాగుతుంది ‘బాహుబలి’ సినిమా. ఇప్పుడు ఈ తరహా లోనే కొన్ని సినిమాలు టాలీవుడ్లో మేకింగ్‌లో ఉన్నాయి.
రామ్‌చరణ్ గేమ్‌చేంజర్
రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘గేమ్‌చేంజర్’. ఇందులో తండ్రీకొడుకులుగా కనిపిస్తారు రామ్‌చరణ్. కొడుకు పాత్ర ఐఎఎస్ ఆఫీసర్. తండ్రీది రాజ కీయ నేపథ్యం ఉన్న పాత్ర. కొడుకు పాత్ర స్టోరీ ప్రజెంట్లో జరిగితే..తండ్రి పాత్ర స్టోరీ 1980లో జరుగుతుంది. రాజకీయాల్లో తండ్రికి జరిగిన అన్యాయా నికి చట్టబద్ధంగా కొడుకు ఏ విధంగా పగ తీర్చుకుంటాడు? అన్నదే ఈ సినిమా కథ అని గ్యాసిప్. చరణ్ పాత్రకు ప్రజెంట్లో కియారా అద్వానీ, ఫ్లాష్‌బ్యాక్‌లో అంజలి జంటగా కనిపిస్తారట. ‘దిల్’రాజు, శీరిష్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. ఓ దశలో ‘గేమ్‌చేంజర్’ రెండు భాగాలుగా కూడా విడుదలవుతుందనే ప్రచారం కూడా సాగింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచో జరుగుతోంది.
ఎన్టీఆర్ దేవర
ఎన్టీఆర్ దేవర కూడా తండ్రీకొడుకుల నేపథ్యంలో సాగే కథే అని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇప్పటికే ఈ సిని మా నుంచి విడుదలైన రెండు లుక్స్ ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నాయి. పైగా ‘దేవర’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ ఆల్రెడీ ప్రకటించారు. నేపథ్యంలో కాస్త అటు ఇటుగా ‘బాహుబలి’ టెంప్లెట్లోనే ‘దేవర’ కథ కూడా ఉండబోతుందనే గ్యాసిప్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం తొలిపార్టు ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
ప్రభాస్ సలార్
‘సలార్’ సినిమా విడుదలైనప్పట్నుంచి ఈ సినిమాలో ప్రభాస్ది డ్యూయోల్ రోల్ అనే ప్రచారం సాగుతూనే ఉంది. ప్రచారంలో ఉన్నట్లుగానే ‘సలార్’ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ ఉన్న ప్రభాస్ పోస్టర్స్ విడుదలైయ్యాయి. ఊహించనట్లుగానే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. ‘సలార్’ సినిమా తొలిపార్టు ‘సలార్:సీజ్ఫైర్’ ఇటీవలే విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా ఎండ్ టైటిల్ రోల్స్‌లో ప్రభాస్ కొత్త గెటప్‌లో కనిపిస్తారు. ‘సలార్:సీజ్ఫైర్’కు సీక్వెల్‌గా ‘సలార్: శౌర్యాంకాపర్వం’ ఉంది. ఇందులో దేవరథ(ప్రభాస్) తండ్రి పాత్ర ధారగా ప్రభాస్ కనిపిస్తారని ఊహించవచ్చు. సేమ్…‘బాహుబలి’లా తండ్రికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి, కొడుకు హీరో అవుతాడెమో సలార్‌లో కూడా. ‘సలార్’ రెండోభాగం ‘సలార్: శౌర్యాంకాపర్వం’ సినిమా 2025 డిసెంబరులో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో విజయ్‌కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇలా ‘బాహుబలి’లోని కోర్ ఎమోషన్స్ తండ్రీకొడుకుల భావోద్వేగం, రెండుపార్టుల స్ట్రాటజీ ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, ప్రభాస్ ‘సలార్’లో కనిపిస్తోంది.