Ramcharan GameChanger: దసరాకు రామ్‌చరణ్ గేమ్చేంజర్ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట ఈ చిత్రం నిర్మాత ‘దిల్’ రాజు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ సినిమాను దస రా లేదా గాంధీజయంతి (అక్టోబరు 2)న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రం నిర్మాత ‘దిల్’రాజు. ఇందుకు సంబంధించిన వర్క్స్ కూడా మొదలు పెట్టారట ‘దిల్’ రాజు. శిరీష్ మరో నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త.
Jaihanuman Ramcharan: జై హనుమాన్‌లో శ్రీరాముడిగా రామ్‌చరణ్?
గేమ్‌చేంజర్ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయోల్ రోల్ చేస్తున్నారు. ఓ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్‌గా, ఫ్లాష్ బ్యాక్ పాత్రలో రాజకీయ కార్యకర్తగా కనిపిస్తారట రామ్‌చరణ్. సంక్రాంతి ఫెస్టివల్ హాలీడేస్‌ను పూర్తి చేసుకున్న రామ్‌చరణ్ ప్రస్తుతం గేమ్‌చేంజర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రామ్‌చరణ్, సునీల్ కాంబి నేషన్‌లోని సన్ని వేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో సినిమా చేస్తారు చరణ్. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకులు. వెంకట సతీష్ కిలారు, సుకుమార్ రైటింగ్స్, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.