AlluArjun Pushpa2: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’. ఈ సినిమా 2021 డిసెంబరులో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలి చింది. దీంతో ‘పుష్ప’ మలిభాగం ‘పుష్ప: దిరూల్’ తీస్తున్నారు దర్శకుడు సుకుమార్. అయితే ఈ సినిమాలో ఇంట్రవెల్ బ్యాక్‌డ్రాప్‌లో గంగమ్మ జాతర నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంది.
ఈ సీక్వెన్స్ కోసం చిత్రంయూనిట్ భారీ కసరత్తులు చేస్తు న్నారు. దాదాపు యాభై రోజుల కిందట జాతర నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్స్‌ను స్టార్ట్ చేశారు అల్లుఅర్జున్. కొంత షూట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ వెన్నునొప్పితో బాధపడ్డారట. భారీ కాస్ట్యూమ్‌తో యాక్షన్ చేయాల్సి రావడం, సీన్ పర్ఫెక్షన్ కోసం ఆ గెటప్‌లోనే ఎక్కువ సమయం ఉండాల్సి రావడంతో ఈ జాతర సీక్వెన్స్‌కు కాస్త గ్యాప్ ఇచ్చారట అల్లు అర్జున్. సమయం వృథా కాకూడదని అల్లు అర్జున్ కోలుకునే వరకు టాకీ పార్టు తీశారు ఇన్ని రోజులు.
కానీ సమయం దగ్గర పడుతుండటంతో జాతర సీక్వెన్స్‌ను మళ్లీ షురూ చేశారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ జాతర సీక్వెన్స్‌ను మళ్లీ తీస్తున్నారు. మార్చి కల్లా ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌ను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఎందుకంటే …‘పుష్ప: ది రైజ్’ సినిమా రిలీజ్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువ సమయం లేకపోవడంతో చిత్రంయూనిట్ బాగా ఇబ్బందులు ఫేస్ చేసింది.
AlluArjun : అల్లు అర్జున్ తో అట్లీ..మరి త్రివిక్రమ్ ప్లాన్ ఏంటో…
పైగా సుకుమార్ ఎడిట్ రూమ్ డైరెక్టర్. ఎక్కువ షూట్ చేసి, ఎడిట్ రూమ్‌లో ఎడిట్ చేస్తుంటారు. దీంతో…సుకుమార్ అనుకున్న అవుట్‌పుట్ ఎడిట్ రావాలంటే కచ్చితంగా మార్చి కల్లా సినిమా చిత్రీకరణ పూర్తవ్వాలి. ఎందుకంటే…ఆగస్టు 15న ‘పుష్ప: ది రైజ్’ సినిమా విడుదల కు సిద్ధం అవుతోంది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్‌ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
AlluArjun : అల్లు అర్జున్ చేయాల్సిన ఆ రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్లేనా..?