హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తాజాగా రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా మలిభాగం ‘పుష్ప ది రూల్’ షూటింగ్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి అయితే… అల్లు అర్జున్ తర్వాత చిత్రం ఏమై ఉంటుందన్న చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇటీవల త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెల్లడైంది. అలాగే సందీప్ రెడ్డి వంగతో హీరోగా ఓ సినిమా చేయడానికి అల్లు అర్జున్ కమిటైన తెలిసిందే. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ‘యానిమల్’ తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమాకు కమిట్మెంట్ ఉంది. దీంతో ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా స్క్రిప్ట్ తో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగా. దీంతో అల్లు అర్జున్ తర్వాత చిత్రం త్రివిక్రమ్ తోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. అలాగే గతంలో త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల ..వైకుంటపురంలో ..’ అనే మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు హిట్ సాధించాయి. దీంతో వీరి కాంబినేషన్లో రానున్న నాలుగో సినిమాపై కూడా ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు కాదని ,తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడని ప్రచారం తెరపైకి వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఓ సినిమా చేయనున్నాడని ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తీసి హిందీలో సూపర్ డూపర్ హిట్ కొట్టారు అట్లీ ఈ సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించింది . దీంతో వెంటనే అట్లితో సినిమా చేయాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ తర్వాత సినిమా అట్లీతో ఫిక్సయినట్లయితే మరి త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేస్తారని చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘గుంటూరు కారం’ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ అల్లు అర్జునతో చేయనున్న స్క్రిప్ట్ పై వర్క్ చేస్తారా ? లేక..రానా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశ్యప’ సినిమాకు డైలాగ్స్ మొదలు పెడతారా? అనేది చూడాలి. లేక మరో హీరో ఎవరితోనైనా సినిమా షురూ చేస్తారా ? అనేది చూడాలి.