ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘దేవర’ సినిమా టీజర్ విడుదలకు సమయం ఆసన్నమైనది. ఈ సినిమా టీజర్‌ను జనవరి రెండో వారం అంటే.. జనవరి 8న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని తెలిసింది. ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్ తర్వాత.. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ‘దేవర’ సినిమా తొలిభాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్’ కొసరాజు హరికృష్ణ’ మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను భార్య బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ లాంగ్ షెడ్యూల్‌ను పూర్తిచేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు బయలుదేరారు . వచ్చిన తర్వాత ‘దేవర’తో మళ్ళీ బిజీ అవుతారు. ‘దేవర’ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వచ్చే ఏడాది ‘వార్ 2’ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్ .అలాగే ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్‌ను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ ఓ హీరోగా చేస్తున్న ‘వార్2’ ను, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమాలను సమాంతరంగా షూటింగ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తు న్నట్లుగా తెలుస్తోంది.