హీరో అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమాలకు సైన్ చేసే జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోని పుష్ప సినిమాలో పాల్గొంటున్నారు అల్లు అర్జున్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి దాడులు జరిగిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడినట్లు తెలుస్తోంది . ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ పై కూడా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాను కొంతకాలం వాయిదా వేయాలనుకున్నారు . అయితే ఈ లోపు కొత్త సినిమాలకు సైన్ చేసే పనిలో ఉన్నారు అల్లు అర్జున్.ఇ ప్పటికే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు అల్లు అర్జున్ .

తాజాగా త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించాలను కుంటున్నారట. అల్లు అర్జున్ ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల..వైకుంటపురంలో..’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది. అలాగే తనకు రేసుగుర్రంతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇటీవల స్టొరీ లైన్ చెప్పారంట . ఇది అల్లు అర్జున్ కు నచ్చటంతో స్క్రిప్ట్ డెవలప్ చేయవలసినదిగా సురేందర్ రెడ్డిని కోరారట ప్రస్తుతం సురేందర్ రెడ్డి. ఈ స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయితే ఈ సినిమా కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సంగతి ఎలా ఉంచితే 2019లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘ఐకాన్: కనబడుటలేదు’అనే సినిమాను అనౌన్స్ చేశారు . ఆ తర్వాత ఈ సినిమాను గురించిన మరో అప్డేట్ లేదు. మరోవైపు ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఐకాన్ సినిమా క్యాన్సిల్ అయినట్లుగానే భావించవచ్చని ఫిలింనగర్ వాసులు చెప్తున్నారు.
#ICON – కనబడుట లేదు
Happy to announce our 4th collaboration with Southern Star @AlluArjun.
Written and Directed by Sriram Venu#HBDAlluArjun pic.twitter.com/oRd0tbkrIH
— Sri Venkateswara Creations (@SVC_official) April 7, 2019
అలాగే దర్శకుడు కొరటాల శివ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందాల్సింది. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలి నేనే సుధాకర్ యువ సుధా ఆర్ట్స్ పై ఈ సినిమాను నిర్మించాల్సింది కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.
Very much elated to announce my next film #AA21 with Koratala Shiva garu . Been looking forward for this for quiet a while . My best wishes to Sudakar Garu for his 1st venture . Sandy , Swathi & Nutty this is my way of showing of my love for you guys . pic.twitter.com/uwOjtSAMJV
— Allu Arjun (@alluarjun) July 31, 2020
కానీ ప్రస్తుత పరిస్థితుల అదృష్ట అసలు ఈ సినిమా ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. సో.. ఇలా అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్లే.