‘పుష్ప: ది రైజ్’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మలిభాగం ‘పుష్ప: ది రూల్’పై భారీగా అంచనాలు ఉన్నాయి. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్(AlluArjun), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ‘పుష్ప’ మలిభాగం ‘పుష్ప: ది రూల్’తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలోని గంగమ్మ జాతర నేపథ్యంలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇటీవల చిత్రీకరించారు మేకర్స్. అల్లుఅర్జున్ భారీ క్యాస్ట్యూమ్ ధరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కాస్త వెన్నునొప్పితో బాధపడుతున్నారని, దీంతో ‘పుష్ప: ది రూల్’ సినిమా చిత్రీకరణ కాస్త స్లోగా సాగుతుందని తెలిసింది. రష్మికామందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఫాహద్‌ఫాజిల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘పుష్ప: ది రూల్’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.
‘పుష్ప: ది రూల్’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారు అల్లు అర్జున్. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల..వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి. అలాగే సందీప్‌రెడ్డి వంగాతో కూడా అల్లు అర్జున్‌కు ఓ కమిట్మెంట్ ఉంది.