ఇంకా మేజర్ షూటింగ్ పూర్తికాకుండానే ‘పుష్ప: ది రూల్ (Pushpa:The Rule) , సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా రికార్డును బద్దలు కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా 2022 మార్చిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు . అయితే ఆర్ఆర్ సినిమా ఆడియో రైట్స్ 26 కోట్లకు అమ్ముడై అప్పట్లో ఓ సంచలనంగా మారింది. కాగా ఇప్పుడు ఆ రికార్డును ‘పుష్ప: ది రూల్’ సినిమా అధికమించింది. ‘పుష్ప 2’సినిమా అన్ని భాషల ఆడియో హక్కులను దాదాపు 60 కోట్ల రూపాయలకు టీ సిరీస్ (T-Series) కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆర్ఆర్ సినిమా ఆడియో రైట్స్ దాదాపు ఇది రెండున్నర రేట్లు ఎక్కువ.
అల్లు అర్జున్(AlluArjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ఈ సినిమాలోని తొలిభాగం ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలై దాదాపు 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలోని రెండో భాగం ‘పుష్ప : ది రూల్’. మైత్రి మూవీ మేకస్ పతాకం పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పుష్ప ‘ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన పొ న్నియిన్ సెల్వన్ ఆడియో రైట్స్ 24 కోట్లకు, సాహో ఆడియో రైట్స్ 22కోట్ల రూపాయల కు, లియో ఆడియో రైట్స్ 16 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.
AlluArjun : అల్లు అర్జున్ చేయాల్సిన ఆ రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్లేనా..?