AlluArjun-Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ‘పుష్ప’ సెట్స్‌లోకి వెళ్లొచ్చారు. ‘జనతాగ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా రూపొం దుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా అక్కడే జరుగుతోంది. అయితే అల్లుఅర్జున్ ‘పుష్ప’లోని మలిపార్టు ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌ను కూడా ఈ చిత్రం దర్శకుడు సుకుమార్ అక్కడే ప్లాన్చేశారు. ఓ సెట్‌ను క్రియేట్ చేశారు. ఈ సెట్స్‌లోని జూనియర్ ఎన్టీఆర్ వెళ్లొచ్చారు.
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. రీసెంట్గా అల్లు అర్జున్ బర్త్ డే సంద ర్భంగా ట్వీట్టర్లో వీరిద్దరి మధ్య సంభాషణ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ఇటు ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్‌తోనూ జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి అనుబంధమే. జూనియర్ ఎన్టీఆర్ 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో..’
కు సుకుమార్యే దర్శకుడు.
అయితే ‘పుష్ప: ది రూల్’ సినిమా షూటింగ్ మరింత అలస్యమైయ్యాలాఉంది. ఈ చిత్రం నిర్వాణసంస్థ మైత్రీమూవీమేకర్స్పై ఐటీ దాడులు జరగడం, సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ‘పుష్ప: ది రూల్’ సినిమా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది.