Prabhas: ప్రభాస్ కెరీర్‌ను కంప్లీట్‌గా మార్చిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ బాహుబలి సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించారు. అయితే బాహుబలి వంటి హిట్ఫిల్మ్ను తీసిన తర్వాత ఈ నిర్మాతలు ఎందుకో అంత యాక్టివ్‌గా సినిమాలు చేయలేదు. కానీ రీసెంట్గా వీరిని ప్రభాస్ కలిశాడు. దీంతో శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ల కాంబినేషన్లో మరో సినిమారానుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదండోయ్…ఇది ‘బాహుబలి 3’ అని కూడా ఫిల్మ్‌నగర్‌లో వినిపించింది.
కానీ ‘బాహుబలి’ నిర్మాతలతో ప్రభాస్ చేయబోయే సినిమా ‘బాహుబలి 3’ కాదట.క్రిష్ జాగర్లమూడి రీసెంట్గా ఓ పీరియాడికల్ డ్రామా కథను బాహుబలి నిర్మాతలకు చెప్పగా,వారికినచ్చిందని, ఈ కథను ఆర్కా మీడియాపై నిర్మించేందకు క్రిష్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో భాగంగానే ప్రభాస్ వారిని కలిసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఆ నెక్ట్స్ ‘ప్రాజెక్ట్ కె’, రాజాడీలక్స్ చిత్రాలను కంప్లీట్ చేస్తాడు. అప్పుడు ఒకవైపు సందీప్‌రెడ్డి వంగాతో సినిమా చేస్తూ, మరోవైపు క్రిష్సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట ప్రభాస్. ఇటు ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నారు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. ఈ సినిమా పూర్తయినతర్వాత రాధాకృష్ణ చేసే నెక్ట్స్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ప్రభాస్ కోసమే. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ప్రభాస్–ప్రశాంత్‌నీల్– ‘దిల్’ రాజు కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం.