అతడు , ఖలేజా సినిమాల తర్వాత హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రూపదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ చిన్నబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈపాటికి ఆరంభం కావాల్సింది.
కానీ వివిధ కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూనే వస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ వారంలో ప్రారంభించాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభ మయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు కారణం త్రివిక్రమ్ వర్క్ పట్ల మహేష్ బాబు అంతగా ఇంట్రెస్ట్ గా లేడని టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తుంది.
కేజీఎఫ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అండ్ అరివ్
లతో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఈ ఫైట్ కి
మహేష్ కి నచ్చకపోవడంతో ఈ ఫుటేజ్ ని స్క్రాప్
చేశారు. స్క్రిప్ట్ వర్క్ విషయంలో మహేష్ మార్పులు కోరడం తో అసలు కథే మారిపోయిందని సమాచారం.
ఫ్రెష్ గా మళ్ళీ ఓ కథను అనుకుని షూటింగ్ స్టార్ట్ చేశారు. సంక్రాంతికి రీల్ జ్ ప్రకటించారు. కానీ ఎందుకో కానీ షూటింగ్ సజావుగా సాగడం లేదు.
త్రివిక్రమ్ ఈ సినిమా తో పాటుగా, మరో సినిమా స్క్రిప్ట్స్ వర్క్స్ చూసుకోవడం, టైటిల్ విషయంలో
భిన్నాభిప్రాయాలు వంటివి సినిమాకు ఆలస్యానికి
కారణాలుగా తేలుస్తుంది. ఇన్ని సమస్యల మధ్య
షూటింగ్ ను సజావుగా జరుపుకుని 2024 జనవరిలో
రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. అలాగే టైటిల్
లుక్ ను మే 31న విడుదల చేయాలనుకుంటున్నారు.
మరి మేకర్స్ చెప్పినట్లుగా ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.