Ramcharan: దర్శకుడు శంకర్ సినిమాలంటే భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఉంటాయనడంతో ఏ సందేహాం లేదు. అయితే శంకర్ స్టైల్ యాక్షన్ మార్క్ ‘గేమ్‌చేంజర్’లో మరింత ఫోకస్డ్గా కనిపించనున్నట్లు తెలు స్తోంది. రామ్‌చరణ్(Ramcharan) హీరోగా నటిస్తున్న ‘గేమ్‌చేంజర్’ క్లైమాక్స్ అత్యంత భారీ స్థాయిలో తీస్తున్నారు శంకర్. ‘గేమ్‌చేంజర్’ క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ ఈ నెల 24 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మే 5 వర కూ అంటే 12 రోజుల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో దాదాపు వెయ్యిమంది స్టంట్ మాస్టర్స్ పాల్గొననుండటం విశేషం. అంతేకాదు.. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ సినిమాలోని ముఖ్య తారాగణం అయిన హీరో యిన్ కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, నవీన్‌చంద్రలు కూడా పాల్గొంటారనితెలిసింది. సిల్వర్‌స్క్రీన్‌పై ఈ ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.
రామ్‌చరణ్ డ్యూయల్ రోల్
‘గేమ్‌చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు. సినిమాలో వచ్చే 1920 ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో అభ్యుదయం రాజకీయపార్టీ ప్రతినిథిగా, సమకాలీన పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ నటిస్తారు. రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ, తండ్రి రామ్‌చరణ్ పాత్రకు జోడీగా అంజలి కనిపిస్తారు. శ్రీకాంత్ లేదా ఏస్జే సూర్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
తర్వాతి చిత్రం
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా వెంకట సతీష్ కిలారు నిర్మిస్తారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబ రులో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఓ పాత్రలో రామ్‌చరణ్ దివ్యాంగుడిగా కనిపిస్తానే టాక్ వినిపిస్తోంది.