Ramcharan: సంక్రాంతికి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, మహేశ్‌బాబుల సినిమాలతో పాటుగా రామ్‌చరణ్ సినిమా కూడా రిలీజ్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ మార్చి 27న అంటే రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ‘గేమ్‌ఛేంజర్’టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలైంది. రిలీజ్‌డేట్ ప్రకటించలేదు. దీంతో ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ వాయిదా పడితేమహేశ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్స్ రికార్డ్స్ సృష్టిస్తాయని అందరూ ఊహించారు.
Prabhas: ప్రభాస్‌కు సంక్రాంతి కలిసి రానట్లేనా?
కానీ చరణ్ గేమ్‌ఛేంజర్ ప్లాన్ వేశాడు. అన్నీ సవ్యంగా జరిగి సంక్రాంతికి వస్తే మహేశ్, ప్రభాస్ సినిమాలతో పోటీ పడాలి. థియేటర్స్ షేర్ చేసుకోవాలి. కలెక్షన్స్ తగ్గే ప్రమాదమూ ఉంది. అదే సోలో రిలీజ్‌గా వస్తే ‘గేమ్‌ఛేంజర్’కు కొత్త రికార్డులు వస్తాయి.


మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అంటే తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. రికార్డు ఓపెనింగ్స్ కన్ఫార్మ్. కానీ తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో ఈ సినిమాకు అంత కలెక్షన్స్ ఏమీ రాపోవచ్చు. కానీ శంకర్ దర్శకత్వంలోని సినిమా అంటే తమిళ మార్కెట్‌లో టాప్ క్రేజ్ ఉంది. ఇటు రామ్‌చరణ్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో హిందీ, ఓవర్‌సీస్ మార్కెట్‌లో గుర్తింపు ఉంది. సో..వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సంక్రాంతికి కాకుండా సమ్మర్‌లో థియేటర్స్‌కు వస్తే ఓపెనింగ్ డే, ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్‌లోసరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం. మరి..ఈ సమీకరణాల ప్రకారం రామ్‌చరణ్ అదిరిపోయే ప్లాన్‌వేసినట్లే మరి.