Kollywood : కోలీవుడ్ లో కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తీశారు హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తమిళ సంవత్సరాది అంటే ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 14 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్. కానీ ఇదే రోజున సూర్య ‘కంగువ’ సినిమా ను విడుదల చేయాలని చిత్రం యూనిట్ ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తోంది. రెండు పార్ట్స్ గా ఈ సినిమా రానుంది. కే ఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి పార్ట్ ను ఏప్రిల్ 14న విడుదల చేయలను కుంటున్నారు.
ఇక విక్రమ్ సినిమా కూడా జనవరి నుంచి ఏప్రిల్ రిలీజ్ కు షిఫ్ట్ అయ్యింది. ఇంకా రిలీజ్ తేదీ ఫిక్స్ కాలేదు. ఇండియన్ 2, కంగువ సినిమాలు ఒక వేళ ఏప్రిల్ 14న రాకపోతే అప్పుడు తంగలాన్ ను ఈ తేదీ కి రిలీజ్ చేయలనుకుంటున్నారు. ఇలా ఇండియన్ 2, తంగలాన్, కంగువ సినిమాల మధ్య రిలీజ్ విషయంలో కోల్డ్ వార్ నడుస్తుందట. మరి ఫైనల్ గా తమిళ సంవత్సరాది కి ఏ సినిమా విడుదల అవుతుందో చూడాలి.