UV Creations: అవును…టాలీవుడ్లో ఓ ప్రముఖ నిర్మాణసంస్థ అయిన యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం నిర్మిస్తున్న సిని మాలను గమనిస్తే ఫ్యాంటసీ మాయలో యూవీక్రియేషన్స్ ఉందనిపిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘విశ్వంభర’. ఈ సినిమాను యూవీ క్రియే షన్స్ నిర్మిస్తోంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకుడు. మరో హీరో సూర్య చేస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఫుల్‌గా ఉన్నాయని రిలీజైన ఈ సినిమా ప్రమో షన్ కంటెంట్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమానే కాక…అఖిల్‌తో ఓ భారీ ఫ్యాంటసీ సినిమా తీయాలని యూవీక్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా బడ్జెట్ వందకోట్లకు పైనే అని టాక్. పైగా ఈ సినిమా ప్రాజెక్ట్‌లో హోంబలే ఫిల్మ్స్ విజయ్‌కిరగందూర్ భాగస్వామ్యులు కానున్నారట. ఇలా మూడు భారీ ఫ్యాంటసీ సినిమాను సినిమాలను తీస్తోంది యూవీక్రియేషన్స్.
అయితే చిరంజీవి కెరీర్‌లోని ఫ్యాంటసీ మూవీ ‘అంజి’ సూపర్‌హిట్ కాలేదు. అఖిల్‌కు వందకోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్ సినిమా లేదు. ‘కంగువ’ సినిమా ఫలితం ఇంకా రాలేదు. మరి..యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలు ఏ మేరకు ఈ సంస్థ బక్సాఫీస్ బలాన్ని ఇస్తాయో చూడాలి. అయితే.. ప్రస్తుతం ఫ్యాంటసీ ట్రెండ్ నడుస్తోంది. ‘కాంతార’, ‘కార్తీకేయ 2’, విరూపాక్ష రీసెంట్గా హనుమాన్ సినిమాలు బాక్సాఫీస్ బెండు తీశాయి. మరి.. ఈ ట్రెండ్ యూవీ క్రియేషన్స్‌కు ఎంత లాభిస్తుందో చూడాలి.