Sankranthi2025: ఈ ఏడాది అంటే 2024 సంక్రాంతి సినిమాల ఫుల్‌రన్ బాక్సాఫీస్ ఇంకా క్లోజ్ కాలేదు. కానీ అప్పుడే 2025 సంక్రాంతికి ఫలానా సినిమాలు వస్తున్నాయి అన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. చిరంజీవి ‘విశ్వంభర’ చి త్రం సంక్రాంతికి వస్తున్నట్లుగా తొలుత ప్రకటించారు. దొరబాబు పాత్రలో నటిస్తున్నారు చిరంజీవి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘విశ్వంభర’ ఓవర్సీస్ డీల్ 18 కోట్ల రూపాలయకు పూర్తయింది. మరోవైపు రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా సంక్రాంతి హిట్స్ కొట్టిన నాగార్జున వచ్చే సంక్రాంతికి కూడా ఓ సినిమాను దింపాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ‘నాసామిరంగ’ సినిమా సక్సెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇక 2017లో సంక్రాంతికి విడుదలైన ‘శతమానంభవతి’ సినిమాకు సీక్వెల్‌ను ప్రక టించారు ‘దిల్’ రాజు. ఇలా ఇప్పటికే మూడు సినిమాలు 2025 సంక్రాంతికి రెడీ అవు తున్నాయి.
ఆసక్తికర విషయం ఏంటంటే…సంక్రాంతికి రిలీజ్ చేస్తాము అని గత మూడేళ్లలో తొలుత ప్రకటించిన సినిమాలు ఏవీ సంక్రాంతికి రిలీజ్ కాలేదు. కాస్త ఆశ్చర్యకరంగ ఉన్నా ఇది నిజమే. ‘గబ్బర్‌సింగ్’తర్వాత పవన్‌కళ్యాణ్, హరీష్‌శంకర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను 2024 సంక్రాంతి రిలీజ్‌కు ప్రకటించారు. ఏమైంది. .ఇప్పుడు షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాను రిలీజ్ డేట్‌తో సహా జనవరి 12 అంటూ ప్రకటించారు. ఈ సినిమా వేసవి రిలీజ్‌కు వాయిదా పడింది. రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, విజయ్‌దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ సినిమాలను సంక్రాంతి రేసులో దింపాలని ‘దిల్’ రాజు ప్రయత్నించారు కానీ కుదర్లేదు. రవితేజ ‘ఈగల్’ వివిధ సమీకరణాల కారణంగా వాయిదా పడింది. ఒక్క గుంటూరుకారం సినిమా మాత్రం సంక్రాంతికి ముందుచెప్పినట్లుగా విడుదలైంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హను–మాన్’, ‘సైంధవ్’ సినిమాలు మధ్యలో వచ్చి చేరినవే. మొదట్నుంచి ఉన్నవి కావు..ఇలా 2024 సంక్రాంతి రిలీజ్‌కు చాలా సమీకరణాలు ఉండొచ్చు. అందుకే ఇల్లు అలకగానే పండగ కాదు…సంక్రాంతి రిలీజ్ అనగానే సంక్రాంతికి ఆ సినిమా విడుదల కాదని సరదా అనుకుంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు.
‘రాధేశ్యామ్’, ‘కల్కి 2898ఏడీ’ సినిమాలను ప్రభాస్ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాడు కుదర్లేదు. కానీ ‘రాజాసాబ్’, ‘సలార్ 2’లలో ఏదో ఒక సినిమాను 2025 సంక్రాంతికి దించాలనే పట్టుదలతో ఉన్నా డట ప్రభాస్. ‘రాజాసాబ్’ వస్తే ఒకే. కానీ ‘సలార్ 2’ సంక్రాంతికి అంటే మాత్రం చాలా సమీకరణాలు మారతాయి. కొత్త సంక్రాంతికి కొత్త సినిమాలు బరిలోకి దిగుతాయి.