Venkatesh76:వెంకటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన 75వ సినిమా ‘సైంధవ్’ నిరాశపరిచింది. ‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. తాజాగా వెంకీ నెక్ట్స్ సినిమా (Venkatesh76) పై ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన సంగతలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్‌రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. ‘దిల్’ రాజు నిర్మిస్తారు. కాగా ఈ సినిమా టైటిల్‌ను గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘సంక్రాంతికికలుద్దాం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ‘ఎఫ్ 2’ సినిమా సంక్రాంతి సందర్భంగానే విడుదలై, బ్లాక్‌బస్టర్ కొట్టింది. ‘ఎఫ్ 3’ సినిమాను సంక్రాంతి విడుదలకే ప్రకటించారు. కానీ వాయిదా వేసి 2022 మేలో విడుదల చేశారు. మరి.. ‘సంక్రాంతికి కలుద్దాం’ అనే టైటిల్‌తోనే 2025 సంక్రాంతికి వెంకీ వస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు 2005లో వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతి’ అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది.
ఇక 2025 సంక్రాంతికి చిరంజీవి ‘విశ్వంభర’ను ప్రకటించారు. జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. నాగార్జున 2025కు సంక్రాంతికి ఓ సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పుడు వెంకీ ఇలా వస్తున్నారు. ప్రభాస్ ‘రాజాసాబ్’ సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇలా 2025 సంక్రాంతి సీజన్ ఆసక్తికరంగా ఉండబోతోంది.