Venkatesh Saindhav Review: వెంకటేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఆయన 75వ చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’, ‘హిట్ 2’ సినిమాలను తీసిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మేజర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ చేసిన ఈ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి. మరి…‘సైంధవ్’ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? రివ్యూలో చదివేద్దాం.
సినిమా: సైంధవ్
ప్రధాన తారాగణం: వెంకటేష్, శ్రద్ధాశ్రీనాథ్, రుహానీశర్మ, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, చైల్డ్ ఆర్టిస్టు సారా
దర్శకుడు: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సంగీతం: సంతోష్ నారయణన్
విడుదల: జనవరి 13, 2024
కథ
చంద్రప్రస్థలో క్రేన్ ఆపరేటర్ కోనేరు సైంధవ్. చంద్రప్రస్థ పోర్టులో పనిచేస్తుంటాడు. సైంధవ్ కుమార్తె సారాకు స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అనే జన్యుపరమైన డిజా ర్డర్ ఉంటుంది. సారా బతాకాలంటే 17కోట్ల రూపాయల ఖరీదైన ఇంక్షన్ కావాలి. మరోవైపు చంద్రప్రస్థలో క్యాటల్ అనే సిండికేట్ గ్రూప్ క్రైమ్స్ చేస్తుంటుంది. ఈ గ్రూప్ లీడర్ విశ్వామిత్ర(ముఖేష్ రుషి). ఇరవైవేలమంది టినేజర్ అబ్బాయిలకు గన్స్ హ్యాండిలింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించి, వీరిని విదేశీ ఉగ్రవాద సంస్థలకు అప్పజెప్పేలా క్యాటల్ గ్రూప్‌కు ఓ భారీ డీల్ చేస్తాడు వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖీ). కానీ ఈ డీల్ కంప్లీట్ కాకుండ సైంధవ్ అడ్డుపడుతుంటాడు. క్యాటల్ డీల్‌ను ఆపేందుకు సైంధవ్ ఎందుకు ప్రయత్నిస్తుంటాడు? అసలు..క్యాటల్ గ్రూప్‌కు సైంధవ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? తన కూతురు సారాను సైంధవ్ కాపాడుకోగ లిగడా? లేదా? అన్నది ఈ సినిమా కథాంశం.
విశ్లేషణ
హింసకు ఆకర్షితులుతున్న టీనేజ్ అబ్బాయిల రక్షణ అనే పాయింట్ బాగుంది. స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ ని దర్శకుడు అడ్రస్ చేయడం బాగుంది. కానీ క్యాటల్ డీల్‌ను అడ్డుకునేందుకు సైంధవ్ చేసేది హింస. సారా ఎమోషన్. కానీ ఈ రెండింటిని దర్శకుడు శైలేష్ హ్యాండిల్ చేయలేకపోయాడు. పైగా ఎమోషన్‌ను మించి హింస ఈ సినిమాలో ఉంటుంది. కొన్ని యాక్షన్ సీన్స్‌లో అయితే ఓవర్ది బోర్డ్ వయలెన్స్ కనిపిస్తుంది. కుమార్తెను కాపాడాల్సిన అవకాశం చేతిలోఉన్న ఈ పనిని సెకండ్ ప్రీయారిటీగా తీసుకుని, ఫస్ట్ ప్రియా రిటీగా క్యాటల్ గ్రూప్ డీల్‌ను తీసుకోవడం అనేది డిస్ కనెక్ట్ పాయింట్. క్యాటల్ గూప్ సభ్యుడిగా సైంధవ్ ప్లాష్‌బ్యాక్‌కు సరైన ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. పైగా అక్కడడక్కడ వచ్చే సైంధవ్ ప్లాష్‌బ్యాక్ సీన్స్ కథకు నప్పవు. వెంకటేష్ 75 ఫిల్మ్ అని కాబోలు …వెంకీ హీరోయిజమ్, యాక్షన్‌పైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు ఉన్నాడు. అయితే బుజ్జికొండ సాంగ్ మాత్రం కంటతడి పెట్టిస్తుంది. క్లైమాక్స్ కూడ సరిగా ఉండ దు. ఇక్కడ కూడా యాక్షనే మేజర్ టేకాఫ్ తీసుకుంటుంది. దర్శకుడు యాక్షన్‌పై కాకుండ డ్రామాపై ఎక్కువ ఫోకస్ పెట్టిఉంటే బాగుండేది. తమిళ ఫిల్మ్ కమల్‌హాసన్ ‘విక్రమ్’ ఛాయలు కనిపిస్తాయి. సినిమా టేకాఫ్ కూడా ఆ సినిమాలనే మొదలవుతుంది. స్క్రీన్ నిండా ఆడియన్స్‌కు తెలిసిన ఆర్టిస్టులే. కథలో వీరి పాత్రలను బలంగా చూపించలేకపోయాడు దర్శకుడు.
ఎవరు ఎలా చేశారంటే…
సైంధవ్ కోనేరు ఆలియాస్ సైకో పాత్రలో వెంకటేష్ యాక్టివ్ యాక్షన్ చూపించారు. తనదైన ఎమోషనల్ మార్క్‌ను చూపించాడు. కానీ కథలో ప్రేక్షకులను ఏట్రాక్ట్ చేసే ఎమోషనల్ డ్రామా లేదు. క్యాబ్ డ్రైవర్ కమ్ సారా కేర్ టేకర్ మనోజ్ఞ పాత్రలో శ్రద్ధశ్రీనాథ్ పర్వాలేదు. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకే అనిపిస్తాడు. కానీ నవాజును దర్శుడుకు సరిగా వాడుకోలేదు. ఓ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, రోటీన్ డైలాగ్స్‌తో సరిపెట్టాడు. ఇక డాక్టర్ రేణుగా రుహానీ శర్మ పాత్ర పరిధిమేర యాక్ట్ చేశారు. జాస్మిన్‌గా ఆండ్రియా కొన్ని సీన్స్‌లో హై ఇచ్చారు. కానీ ఈ పాత్రకు సరైన జస్టిఫికేషన్ ఉండుదు. సైంధవ్‌కు హెల్ప్ చేసే మానస్‌గా ఆర్య గన్స్ పేల్చడమే తప్ప చేసింది ఏమీ లేదు. పోర్టు అధికారి మూర్తిగా జయప్రకాష్ది ఓ రెగ్యులర్ పాత్ర. ఇక చైల్డ్ ఆర్టిస్టు సారా బాగా యాక్ట్ చేసింది. సంతోష్‌నారాయణ్ మ్యూజిక్, ఆర్ఆర్ ఈ సినిమాకు ఫ్లస్ కాలేకపోయాయి.
ఫైలన్గా…దిక్కుతోచని సైంధవ్