Director Maruthi:చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమా ఫ్లాప్. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అన్న చర్చ ఇండస్ట్రీల జోరుగా సాగింది. పీఎస్ మిత్రన్, కళ్యాణ్‌కృష్ణ, బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ రావి పూడి, మారుతి (Maruthi), బోయపాటి శీను, గోపీచంద్ మలినేని ….ఇలా మంది దర్శకులు పేర్లు వినిపించాయి. అయితే దర్శకుడు మారుతితో చిరంజీవి సినిమా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోయింది. ఈ విషయాన్ని మారుతి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు.
#Chiranjeevipic.twitter.com/KdzSUJygdH
— TollywoodHub (@tollywoodhub8) January 29, 2024
‘చిరంజీవిగారికి ఓ కథ చెప్పాను. ఆయన సరే ముందుకు వెళ్దాం అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌తో నేను చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఆలస్యం అవుతోంది. చిరంజీవిగారితో సినిమా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు మారుతి. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాను పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో, మాళవికమోహనన్, నిధీ అగర్వాల్, రిద్దికుమార్ (రాధేశ్యామ్ ఫేమ్) హీరోయిన్స్‌గా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఈ ఏడాదే విడుదల కా నుంది. మరోవైపు చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో ‘విశ్వంభర’ చేస్తున్నారు. మారుతి రాజాసాబ్, చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాలు పూర్తిఅయిన తర్వాత …చిరంజీవి–మారుతి కాంబోలో ఓ సినిమా ఉండే చాన్సెస్ కనిపిస్తున్నాయి.