Prabhas Kalki2898AD: ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ (Kalki2898AD) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ఈ సినిమా అంతర్జాతీయస్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను భారతీయభాషల్లోనే కాక ఇంగ్లీష్‌లోనూ ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 09న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. అయితే ఈ తరుణంలో ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు ఊహించని షాక్ ఓవర్సీస్లో తగిలింది. అది ఏంటంటే….మే నెలలో పెద్ద హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ర్యాన్ గోస్లింగ్, ఎమిలీ బ్లంట్ లీడ్ రోల్స్ చేసిన ‘ది ఫాల్గాయ్’(The Fall Guy) చిత్రం మే 3న విడుదలకు సిద్ధమైంది. ఇక ముఖ్యంగా ఓవెన్టిగ్, ఫ్రెయా అల్లన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కింగ్డమ్ఆఫ్ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (Kingdom of the Planet of the Apes) చిత్రం మే 10 అంటే..ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు ఒక్కరోజు ఆలస్యంగా విడుదల అవుతోంది. ఇక మే 23న హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ఫిల్మ్ ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్మ్యాక్స్ సాగ’ (Furiosa: A Mad Max Saga) చిత్రం విడుదల కానుంది.
ఇలా ‘కల్కి 2898ఏడీ’ విడుదల అవుతున్న సమయంలో హాలీవుడ్ చైన్‌లో మూడు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకవేళ ‘కల్కి 2898ఏడీ’ కూడా మే09నే విడుదల అయితే ‘ది ఫాల్గాయ్’, ‘కింగ్ డమ్ ఆఫ్‌ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రాల నుంచి గట్టిపోటీ ఎదుర్కొవాల్సి వస్తుంది. స్క్రీన్ షేరింగ్ ఎక్కవ ఈ హాలీవుడ్ చిత్రాలకే ఉంటుంది. ఇలా ‘కల్కి 2898ఏడీ’ సినిమాలకు కలెక్షన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరి…‘కల్కి 2898ఏడీ’ సినిమాను ముందుగా ఇండియాలో రిలీజ్ చేసి, ఆ తర్వాత వీలు చూసుకుని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేస్తే ఒకింత ప్రయోజనం ఉండేలా కనిపిస్తోంది. ఇలా చేస్తే ప్రభాస్ మూవీ ‘ఓపెనింగ్ డే రికార్డ్స్‌పై ప్రభావం పడుతుంది. మరి..ఏం జరుగుతుందో చూడాలి.
The Raja saab: ఈ ప్రకారం రాజాసాబ్ సంక్రాంతికి రానేరాడు!
ఇక ఈ సినిమాలో దీపికాపదుకొనె, అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దుల్కర్సల్మాన్, విజయ్‌దేవరకొండ, నాని, అన్నా బెన్, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.