Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫ్యూచరిస్ట్ సైన్స్‌ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడీ’. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాజమౌళి ఈ కీలకమైన పాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో దర్శకుడు రాజమౌళి చేసే పాత్ర పేరు వేదవ్యాస్ అని తెలిసింది. ఆల్రెడీ రాజమౌళి పాత్ర తాలుకూ షూటింగ్ కూడా పూర్తయింది.
అలాగే ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ, దుల్కర్‌సల్మాన్‌లు కీలక పాత్రల్లో కనిపించే చాన్సెస్ ఉన్నాయని తెలిసింది. వైజయంతీమూవీస్పై అశ్వనీదత్ ప్రతిష్టా త్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సో..విజయ్,దుల్కర్లను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని అశ్వనీదత్ రిక్వెస్ట్ చేశారట. పైగా దుల్కర్సల్మాన్ తెలుగులో చేసిన తొలి స్ట్రయిట్ మూవీ ‘మహానటి’ని నిర్మించింది వైజయంతీమూవీస్. అలాగే విజయ్‌దేవరకొండ కాస్త పాపులర్ అయ్యింది ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో. ఈ సినిమాను వైజయంతీమూవీస్ సబ్ బ్యానర్ స్వప్నాదత్ సినిమాస్ నిర్మించింది.
కాబట్టి…వైజయంతీమూవీస్ రిక్వెస్ట్‌ను దుల్కర్, విజయ్ కాదనలేక పోవచ్చు. పైపెచ్చు దుల్కర్ అంటే మలయాళం మార్కెట్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుంతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ నుంచి కమల్‌హాసన్, బాలీవుడ్ నుంచి అమితాబ్‌బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొనె ఉన్నారు. ఇప్పుడు దుల్కర్ తోడైతే మరింత బలంగా ఉంటుంటి మార్కెట్ పరంగా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్‌తో సంబంధంలేని సన్నివేశాలను చిత్రీకరి స్తున్నారు. ఈ నెల చివరి వారంలో ప్రభాస్ షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. ‘కల్కి 9828ఏడీ’ సినిమాను మే 9న విడుదల చేయాలనుకుంటున్నారు.