Director Sukumar: దర్శకుడు సుకుమార్ (Director Sukumar) స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ‘రంగస్థలం’ సినిమాలో చూశాం. ఇప్పుడు అంతకుమించిన పొలిటికల్ మ్యాజిక్‌ని ‘పుష్ప: ది రూల్’లో చూపించాలని సుకుమార్ అనుకుంటున్నారట.ఇందుకు సంబంధించి స్క్రిప్ట్‌లో చాలా మార్పులు కూడా చేశారట. పుష్పరాజ్ (హీరో అల్లు అర్జున్), ఎస్పీభన్వర్సింగ్ షెకావత్(ఫాహద్‌ఫాజిల్)ల మధ్య ‘పుష్ప:ది రూల్’ మెయిన్ కథ అంతా జరుగుతుందని అనుకుంటున్నారు ఆడియన్స్. ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ ఎండింగ్ కూడా ఇలానే పూర్తవుతుంది.కానీ ‘పుష్ప: ది రూల్’ మెయిన్ స్టోరీ సిండికేట్ మెంబర్, ప్రజా చైతన్య పార్టీ ఎంపీ భూరెడ్డి సిద్దప్ప(రావురమేష్)ల మధ్య సాగుతుందని సమాచారం. అంతేకాదు…ఇందులో ఇంటర్నేషనల్ మాఫియా కూడాఉంటుందట. ఈ సీన్స్‌లో జగపతిబాబు విలన్‌గా కనిపిస్తారట. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రంయూనిట్ అహర్నిశలు శ్రమపడి షూటింగ్ చేస్తోంది. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్‌ఫాజిల్, అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త.
Director Sukumar: పొలిటికల్ పుష్ప?
దర్శకుడు సుకుమార్ (Director Sukumar) స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ‘రంగస్థలం’ సినిమాలో చూశాం. ఇప్పుడు అంతకుమించిన పొలిటికల్ మ్యాజిక్‌ని ‘పుష్ప: ది రూల్’లో చూపించాలని సుకుమార్ అనుకుంటున్నారట.
Leave a comment
Leave a comment