PushpaTheRoar: ‘పుష్ప’ (Pushpa) సినిమా కోసం చాలా పరిశోధన చేశాను. అసలు..’పుష్ప’ సినిమా స్క్రిప్ట్‌ను తొలుత ఓ వెబ్‌సిరీస్‌గా తీద్దామనే స్టార్ట్ చేశాను. ఓ దశకు చేరుకున్న తర్వాత ‘పుష్ప’ సినిమాను పెద్ద స్కేల్లో సినిమాగా తీయాలనిపించి ‘పుష్ప ది రైజ్’ను స్టార్ట్ చేశాం’…2021 డిసెంబరులో ‘పుష్ప’ తొలి పార్టు ‘పుష్ప ది రైజ్’ రిలీజ్ సందర్భంగా దర్శకుడు సుకుమార్ చెప్పిన మాటలు ఇవి.
ఇప్పుడు సుకుమార్ ఈ మాటలనే నిజం చేస్తున్నట్లుగా ఉన్నారు. ‘పుష్స’ సినిమాను ఓ ఫ్రాంచైజీగా తీసే పనిలో పడ్డారు. ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప ది రైజ్(Pushpathe rise) ‘ హిట్ సాధించింది. దీంతో ప్రస్తుతం ‘పుష్ప ది రూల్ (PushpaTheRule)‘పై బిజీగా ఉన్నారు ఈ చిత్రం దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్. అయితే ‘పుష్ప’ థర్డ్ పార్టు ‘పుష్ప ది రోర్ (PushpaTheRoar)’ కూడా ఉందన్నది ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం.
‘పుష్ప ది రూల్’ సాధించే హిట్‌పై ‘పుష్ప ది రోర్’ సినిమా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. పుష్ప ది రూల్ పెద్ద విజయం సాధిస్తే…’పుష్ప ది రోర్’ కొంత గ్యాప్ తర్వాత సెట్స్‌కు వెళ్తుంది. ఒకవేళ ‘పుష్ప ది రూల్’ ఫర్వాలేదనిపిస్తే..’పుష్ప ది రోర్’కు కాస్త సమయం పట్టవచ్చు. ఇక ‘పుష్ప ది రూల్’ చిత్రం ఆగస్టు 15న థియేటర్స్‌లో విడుదల కానుంది. నవీన్ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.