Lokesh Kanagaraj: హీరోయిన్ శ్రుతీహాసన్(Shruti Haasan) ప్రజెంట్ ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. శ్రుతీ చేసిన ఇంగ్లీష్ ఫిల్మ్ ‘ది ఐ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్‌తో ‘చెన్నైస్టోరీ’ చేస్తున్నారు శ్రుతీహాసన్. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ ‘సలార్'(Salaar) ప్రాంచైజీలో శ్రుతీహాసన్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలు ఇలా ఉండగానే శ్రుతీహాసన్మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఓ టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో శ్రుతీహాసన్ ఓ సినిమా చేసేందుకు రెడీఅవుతున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కమల్‌హాసన్ ఈ సినిమాను నిర్మిస్తారట. ఈ ప్రాజెక్ట్‌కు సబంధించిన హింట్‌ను కూడా షేర్ చేశారు యూనిట్.
Inimel Delulu is the New Solulu#IdhuveyRelationship#IdhuveySituationship#IdhuveyDelusionship#Ulaganayagan @ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/obbnfciiPg
— Raaj Kamal Films International (@RKFI) February 6, 2024
మరోవైపు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో శ్రుతీహాసన్ భాగం అయ్యారని, శ్రుతీ ప్రధాన పాత్రలో లోకేష్ ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్ ఏదీ చేయడం లేదన్నది మరోవైపు నుంచి వినిపిస్తున్నమాట. అలాగే కమల్‌హాసన్ ‘విక్రమ్ 2’లో శ్రుతీహాసన్ ఉంటారన్నది మరో మాట. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే చిత్రంయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. మరి..