Pawankalyan OG: పవన్కళ్యాణ్ (pawankalyan) హీరోగా లేటెస్ట్ మూవీస్లో ‘ఓజీ’(OG) ఒకటి. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓజీ సినిమాను సెప్టెంబరు 27న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు.
గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ‘ఓజీ’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే పవన్కళ్యాణ్ కెరీర్లోనే ఓ బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలైన సెప్టెంబరు 27నే ‘ఓజీ’ చిత్రం కూడా విడుదలకు ముస్తాబుఅవుతుండటం విశేషం. మరి..అత్తారింటికి దారేది సెంటిమెంట్ కలిసోస్తుందా? చూడాలి. అలాగే సుజిత్ నెక్ట్స్ చిత్రం కూడ డీవీవీ దానయ్య బ్యానర్లోనే ఉండనున్నట్లుగా తెలిసింది. ఇందులో నాని హీరోగా నటిస్తారని సమాచారం.