Pawan Kalyan OG: పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ‘రన్రాజారాన్’, ‘సాహో’ సినిమాలు తీసిన సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్. కాగా ఓజీ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 27న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఓజీ సినిమా రెండు పార్టులుగా విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. తొలిపార్టు సెప్టెం బరు 27న విడుదల అవుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్‌దాస్ కీ రోల్స్ చేస్తు న్నట్లుగా తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయిందట. పవన్‌కళ్యాణ్ ఓ 20 రోజులు సెట్స్‌లో పాల్గొంటే మిగత బ్యాలెన్స్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్‌లో బిజీ గా ఉన్నారు పవన్‌కళ్యాణ్. వేసవిలో ఈ ఎలక్షన్స్ పూర్తి కాగానే ‘ఓజీ’ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు పవన్. అన్నట్లో మరో మాట. పవన్‌కళ్యాణ్ కెరీర్లోనే ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల అయిన సెప్టెంబరు 27నే పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదల అవుతుండటం విశేషం.
Pawan Kalyan OG: అత్తారింటికి దారేది సెంటిమెంట్‌తో ఓజీ?
పవన్‌కళ్యాణ్ కెరీర్లోనే ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల అయిన సెప్టెంబరు 27నే పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదల అవుతుండటం విశేషం.
Leave a comment
Leave a comment