NagAshwinKalki2898AD: హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘కల్కి 2898ఏడీ’ (NagAshwinKalki2898AD) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కథను గురించి చాలా వార్తలు ప్రచా రంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు ‘కల్కి 2898ఏడీ’పై మరిన్ని అంచనాలను పెంచేలా చేశాయి. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగ్ అశ్విన్‌కు ప్రభాస్‌తో చేస్తున్న సినిమాకు ‘కల్కి 2898ఏడీ’ టైటిల్‌నే ఎందుకు పెట్టారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా నాగ్ అశ్విన్ ఈ కింది విధంగా బదులు చెప్పారు.
It's is a fantasy fiction that starts in Mahabharata and 6000 years following that. It has a distinct Indian character.
— Director @nagashwin7 about #Prabhas #Kalki2898AD
#KamalHaasan, #AmitabhBachchan, #DeepikaPadukonepic.twitter.com/wmv0LiKEBR
— TollywoodHub (@tollywoodhub8) February 25, 2024
‘కల్కి 2898ఏడీ సినిమా మహాభారతం నుంచి మొదలవుతుంది. 2898ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది. అందుకే మా సినిమాకు కల్కి 2898ఏడీ‘ అని టైటిల్ పెట్టాము” అని నాగ్ అశ్విన్ చెప్పారు. 2898 ఏడీ నుంచి 6 వేల సంవత్సరాల వెనక్కి అంటే మనం 3102 బీసీకి వెళ్తాం. 3102 బీసీ అంటే మహాభారతం, ద్వాపరయుగం ముగిసిన సమయం అంటూ ఇంటర్నెట్ చెబుతోంది. ఇందుకు తగ్గట్లుగా కొన్ని కల్పిత థియరీలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ ప్రశ్నలు, చిక్కుముడులు విడాలంటే, ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మే 09, 2024 అంటే….’కల్కి 2898ఏడీ’ సినిమా విడుదల వరకు వేచి ఉండాల్సిందే. కావాలంటే ఈ కింద వీడియోను ఓ సారి ఫాలో అవ్వండి.
#Kalki2898ADonMay9#Kalki2898AD#prabhas#DeepikaPadukone#AmitabhBachchan#KamalHassan#DishaPatani#NagAshwinpic.twitter.com/ZAdeUL86OT
— TollywoodHub (@tollywoodhub8) February 25, 2024
ఈ ఫ్యాంటసీ ఫిక్షన్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘2898ఏడీ’ సినిమాలో ప్రభాస్‌తో పాటుగా దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. విజయ్‌దేవరకొండ, నాని, దుల్కర్సల్మాన్, రాజమౌళి, అన్నాబెన్లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించినట్లుగా తెలిసింది. అంతేకాదు..’కల్కి 2898ఏడీ’ ఓ ఫ్రాంచైజీగా ఉండబోతోందని, ఇందులో మొత్తం తొమ్మిది భాగాలు ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మహాశివరాత్రి సందర్భంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టీజర్ వస్తుందని, ఏప్రిల్‌లో ట్రైలర్ ఉంటుందని అనుకుంటున్నారు సినీ లవర్స్. అయితే ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు ఉన్న అన్ని సమీకరణాలను గమనిస్తుంటే ఈ చిత్రం సులభంగా వెయ్యికోట్ల రూపాయల మైలురాయిని చేరుతుందని ఊహించవచ్చు.