Ranveer And Deepika: బాలీవుడ్ వన్నాఫ్ ది ఫెవరెట్స్ కపుల్స్ రణ్‌వీర్‌సింగ్ (RanveerSingh), దీపికా పదుకొనె (Deepikapadukone) గుడ్ న్యూస్ చెప్పారు (Ranveer And Deepika). ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనెలు ఇన్‌స్టాలో తెలిపారు. సెప్టెంబరులోదీపికా పదుకొనె జన్మనివ్వనున్నట్లుగా కూడా వెల్లడించారు రణ్‌వీర్‌సింగ్. 2012 నుంచి రణ్‌వీర్‌సింగ్‌తో డేటింగ్ చేసిన దీపికాపుదుకొనె…2017లో రణ్వీర్తో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు.
2018లో ఇటలీలో రణ్వీర్, దీపికాల వివాహం జరిగింది. దాదాపు ఐదేళ్ల తర్వాత తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న విషయాన్ని దీపికా, రణ్వీర్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’, అజయ్‌దేవగన్ ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో నటిస్తున్నారు దీపికాపదుకొనె. మరోవైపు ‘సింగమ్ఎగైన్’ సినిమాలో ఓ కీలక పాత్రలో చేస్తున్నారు రణ్‌వీర్‌సింగ్.ఇక హీరోగా రణ్‌వీర్‌సింగ్ ‘డాన్ 3’ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వా నీ హీరోయిన్.