KiaraAdvani Don3: బాలీవుడ్లో ‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తోన్న తాజా చిత్రం ‘డాన్ 3’. షారుక్‌ఖాన్‌తో ‘డాన్: ది చేజ్ బిగిన్స్’, ‘డాన్ 2’ సినిమాలను డైరెక్ట్ చేసిన ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’కి దర్శకత్వం వహించనున్నారు. రణ్‌వీర్‌సింగ్ హీరో8గా చేయనున్న ‘డాన్ 3’లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారు. అధికారిక ప్రకటన వెల్లడైంది. ఐకానిక్ ‘డాన్ 3’లో భాగం అవుతున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నట్లుగా కియారా అద్వానీ పేర్కొన్నారు. సెప్టెంబరులో ‘డాన్ 3’ సినిమా చిత్రీకరణను ప్రారం భించాలనుకుంటున్నారు. 2025లో ‘డాన్ 3’ చిత్రం విడుదల కానుంది.
ప్రస్తుతం ‘డాన్ 3’తో పాటు తెలుగులో ‘గేమ్‌చేంజర్’ సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ. ‘వినయవిధేయరామ’ తర్వాత రామ్‌చరణ్‌తో కియారా అద్వానీ చేస్తున్న రెండో ఫిల్మ్ ఇది. అలాగే యశ్‌రాజ్ ఫిలింస్‌లో రానున్న మరో స్పై ఫిల్మ్ ‘వార్ 2’లోనూ కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తారు. 2025 ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.