కంగువ..సూర్య దశావతారం!
సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫ్యాంటసీ సైంటిఫిక్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’. బాలీవుడ్ హీరో యిన్ దిశాపటానీ, నటుడు బాబీ డియోల్ తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో యోగిబాబు ఓ కీలక పాత్రధారి. ఈ సినిమాలో సూర్య పదికి పైగా గెటప్స్‌లో కనిపిస్తారట. అంటే సూర్య దశవతారం ‘కంగువ’ అని ఊహించుకోవచ్చు. కథ కూడా కొంత 17వ శతాబ్ధంలో, మరికొంత 2020లో జరుగుతుందట. శివ దర్శ కత్వంలో కేజీ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘కంగువ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మరింత ఊపందుకున్నాయి. హీరో సూర్య డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ‘కంగువ’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘కంగువ’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుం దని తెలిసింది. తొలిభాగం మాత్రమే ఏప్రిల్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా ‘కంగువ’ సినిమా ఏప్రిల్ 14న విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ‘కంగువ’ సినిమాను పదికి పైగ భాషల్లో విడుదల చేయాలను కుంటున్నారు మేకర్స్. త్రీడీలోనూ రిలీజ్ చేసే ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలే కాకుండ ‘సూరారైపోట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) తీసిన దర్శకురాలు సుధాకొంగరతో సూర్య మళ్లీ మరో సినిమా చేస్తున్నారు గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. అలాగే వెట్రిమారన్‌తో సూర్యకు ‘వాడివాసల్’ కమిట్మెంట్ ఉంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓమ్ ప్రకాష్ మెహ్రాతో సూర్య ‘కర్ణ’ అనే సినిమా చేస్తారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.