SuryaMovies: అందెంటో కానీ…సూర్య తలపెట్టిన కొత్త సినిమాలు ఏవీ ఓ పట్టాన సెట్స్‌పైకి వెళ్లడం లేదు (Surya Puranaanooru). దాదాపు ఇరవై సంవ త్సరాల తర్వాత దర్శకుడు బాలతో సూర్య ‘అచ లుడు’ (తమిళంలో ‘వనన్‌గాన్’) సినిమా ఆగి పోయింది (SuryaMovies). ఆ తర్వాత ఇదే సినిమాను అరుణ్ విజయ్‌తో తీశాడు బాల. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
సూర్య కమిటైన మరో సినిమా ‘వాడివాసల్’(Vaadivaasal). ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం జల్లికట్టు నేపథ్యంలో ఉం టుంది. ‘వాడివాసల్’ (Vaadivaasal)ను ప్రకటించి, రెండు సంవత్సరాలు కావొస్తోంది. కానీ ఈ సినిమా ముందుకు వెళ్లడం లేదు. లండన్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఈ చిత్రం దర్శకుడు వెట్రిమారన్ చెబుతూనే ఉన్నారు. కానీ వెట్రీమారన్ గత రెండు సంవత్సరాలుగా తమిళ నటుడు సూరి – విజయ్ సేతుపతిలతో ‘విడుదలై’ ఫ్రాంచైజీ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు.
అచలుడు, వాడివాసల్ సినిమాలు తాత్కాలికంగా నిలిపోయాయి. ఈ తరుణంలో తనకు సూరారైపోట్రు వంటి హిట్ ఫిల్మ్ ఇచ్చిన సుధాకొంగరతో సినిమా కమిటైయ్యారు సూర్య. puranaanooru (Surya 43)ఈ వేసవిలోపు ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లుందని అందరు అను కున్నారు. కట్ చేస్తే…ఈ చిత్రం ప్రారంభం కావడానికి కొంత సమయం పడు తుందన్నట్లుగా సూర్య ఓ నోట్‌ను విడుదల చేశారు. దీంతో సూర్య ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. నిరాశ చెందారు.
ప్రస్తుతం సూర్య నటించిన సోషియోఫ్యాంటసీ ‘కంగువా’ చిత్రం ఈ ఏడాదిలో విడుదల కానుంది. శివ దర్శకుడు. ఈ సినిమాతో దిశాపటానీ, బాబీ డియోల్‌లు తమిళ చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. జ్ఞానవేల్‌రాజా, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలిభాగం ఈ ఏడాదిలోనే విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కాకుండ హిందీలో అక్షయ్‌కుమార్ చేస్తున్న ‘సర్ఫిరా’లో ఓ గెస్ట్ రోల్ చేశారు సూర్య. అంతేకాదు.. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకురాలు. ఈ సినిమాకు సూర్య ఓ సహ–నిర్మాత. ఇక సూర్య–సుధాల కాంబినేషన్లో వచ్చిన ‘సూరారైపోట్రు’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘సర్ఫిరా’ వస్తుంది. జూలై 12న ఈ చిత్రం విడుదల కానుంది.
బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాడైరెక్షన్లో సూర్య ఓ సినిమా చేస్తారని, ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ అనే టైటిల్‌తో ఉంటుందనే టాక్ వినిపిస్తోంన్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగు మాస్ దర్శకుడు బోయపాటి శీనుతో కూడా సూర్య ఓ సినిమా చేస్తారనే ప్రచారం కూడా ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. కమిటైన సినిమాలు స్టార్ట్ కావడానికి కాస్త సమయం పట్టడంతో సూర్య తర్వాతి చిత్రం ఏమై ఉంటుందా? అనే ఆసక్తి నెలకొని ఉంది ఆయన అభిమానుల్లో.