Surya: బాలీవుడ్లో సూర్య ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేసేందుకు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హిందీలో ‘రంగ్ దే బసంతి’, ‘ఢీల్లీ 6’, భాగ్ మిల్కా భాగ్’ వంటి చిత్రాలను తీసిన దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా(Rakeysh Omprakash Mehra)ను 2023 సెప్టెంబరులో కలిశారు సూర్య. అప్పట్నుంచి వీరి కాంబినేషన్లో ఓ మూవీ అనౌన్స్మెంట్ రానుందనే టాక్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ వార్తలే నిజమ య్యే చాన్సెస్ ఉన్నాయని బాలీవుడ్ మీడియా చెబుతోంది. మహాభారతం ఆధారంగా కర్ణుడి దృష్టికోణం నుంచి ఓ సినిమాను ప్లాన్ చేశారట ఓం ప్రకాష్. ఈ సినిమానే సూర్యతో తీయనున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. అంతేకాదు..ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కనిపిస్తారనే టాక్ ప్రచారంలోకి వచ్చింది.
సూర్య హీరోగా నటించిన ‘కంగువ’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. తనకు ‘సూరారైపోట్రు’ వంటి హిట్ ఇచ్చిన సుధాకొంగరతో సూర్య ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకుడు వెట్రిమారన్‌తో సూర్య చేయాల్సిన ‘వాడివాసల్’ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. మరోవైపు వెట్రిమారన్ ‘విడుదలై 2’ కూడ తీస్తున్నారు.
ఇక సూర్య భార్య నటి జ్యోతిక ఇప్పుడు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్నారు. రాజ్‌కుమార్‌రావు చేస్తున్న బయోపిక్ ‘శ్రీ’లో ఓ కీ రోల్ చేశారు జ్యోతిక. అలాగే అజయ్‌దేవగన్, మాధవన్‌లు చేసిన హిందీ చిత్రం ‘సైతాన్’లోనూ జ్యోతికది ఓ లీడ్ రోల్. ఇటు సూర్య కూడా ‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్ ‘స్టార్టప్’లో ఓ గెస్ట్ రోల్ చేశారు. అక్షయ్‌కుమార్ హీరో. తమిళంలో సూరారైపోట్రు సినిమాను తీసిన సుధాకొంగర ‘స్టార్టప్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.