Rajanikanth: ఇప్పటిది కాదు..సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో విజయ్ (Vijay) ఫ్యాన్స్ల వార్. ఎప్పట్నుంచో జరుగుతూనే ఉంది. అయితే ‘జైలర్’ ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ కాకీ, డేగ అంటూ ఓ కథ చెప్పారు. డేగ ఎదుగుదలను చూసి, కాకులు అరుస్తూనే ఉంటాయి. అలాంటి కాకుల అరుపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రజనీకాంత్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అంతే…విజయ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో భగ్గుమన్నారు. ‘జైలర్’ రిలీజ్ సమయంలో సోషల్‌మీడియా వేదికగా కొన్ని అభ్యంతర కామెంట్స్ చేశారు. తాజాగా ఈ వివాదంపై రజనీకాంత్ ‘లాల్‌సలామ్’ సినిమా వేడుక వేదికగా స్పందించారు.
‘‘ఓ రోజు విజయ్ తండ్రి చంద్రశేఖర్ నా సినిమా షూటింగ్ సెట్స్ వచ్చారు. విజయ్‌కు యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉందని చెప్పారు. ముందు చదువు పూర్తి చేసి, ఆ తర్వాత యాక్టర్‌గా కష్టపడమని చెప్పాను. పట్టుదల, క్రమశిక్షణ, శ్రమలతో విజయ్ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇలా విజయ్ చిన్నతనం నుంచి అతన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇక ‘జైలర్’ వేడుకలో నేను చేప్పిన కాకి–డేగల కథ విజయ్ను ఉద్దేశించి ఏమాత్రం కాదు. ఈ కథ అలా విజయ్‌కు ఆపాదించేలా ప్రచారం కావడం నాకు బాధకలిగింది. నిరుత్సాహపరిచింది. తనకు తానే పోటీ అని విజయ్ పలు మార్లు చెప్పారు. అలా నాతో నాకే పోటీ. విజయ్‌కు నాతో పోటీ లేదు. దయచేసి…విజయ్‌కు నాకు పోటీలు పెట్టవద్దు’’ అంటూ రజనీకాంత్ బహిరంగంగా మాట్లాడారు.
ఫ్యాన్స్ వార్ విషయంలో రజనీకాంత్ ఓ అడుగు వెనక్కి తగ్గి రజనీకాంత్ ఇలా మాట్లాడటం బాగుందని, నెటిజన్లు కితాబులిస్తున్నారు. ఇక విష్ణు విశాల్, విక్రాంత్‌లు హీరోలుగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యారజనీకాంత్ తీసిన ‘లాల్‌సలామ్’ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇందులో కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.
ఇక రజనీకాంత్ హీరోగా ‘వెట్టయ్యాన్’ చిత్రం సెట్స్‌పై ఉంది. ‘జైభీమ్’ దర్శకుడు కేజీ జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకుడు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమాను సన్‌పిక్చర్స్ తీస్తుంది. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు.