Chiranjeevi Vishwambhara: పద్మవిభూషణ్ వరించిన హ్యాపీమూడ్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న 156వ సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన వశిష్ట ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. సోషియోఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా తీస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టులో ‘విశ్వంభర’ చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్‌ను మారెడుమిల్లి లొకేషన్స్‌లో తీశారు. మలి షెడ్యూల్‌ను కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటివరకు ‘విశ్వంభర’ సెట్స్‌లో జాయిన్ కాలేదు చిరంజీవి. హీరో అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు వశిష్ట. ఇక ఫిబ్రవరి రెండో వారంలో చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి ‘దొరబాబు’ పాత్రలో నటిస్తారని తెలిసింది. ఈ సినిమా కోసం 13 సెట్స్‌ను రెడీ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమా ఓవర్సీస్ డీల్ పూర్తయింది. ఓవర్సీస్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ వంటి పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సరిగమ సినిమాస్ ‘విశ్వంభర’ సినిమా హక్కులను 18 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అంటే ఓవర్సీస్లో ‘విశ్వంభర’ బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.5 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్స్‌ను దాటాలి. ఇక ‘విశ్వంభర’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
Chiranjeevi Vishwambhara: ఒక్కరోజు షూటింగ్లో జాయిన్ అవ్వకుండానే రికార్డు డీల్
ఓవర్సీస్లో ‘విశ్వంభర’ బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.5 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్స్‌ను దాటాలి. ఇక ‘విశ్వంభర’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
Leave a comment
Leave a comment