AnushkaShetty Ghaati: అనుష్కాశెట్టి చేస్తున్న లేటెస్ట్ ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్ ‘ఘాటి’ (AnushkaShetty Ghaati). అనుష్కా శెట్టి ఓ లీడ్ రోల్ చేసిన ‘వేదం’ సినిమాకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడియే ‘ఘాటి’ సినిమాకు దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ఆంధ్రా–ఒడిస్సా బోర్డర్లో జరిగింది.
వ్యాపార రంగంలో మోసం చేయబడ్డ ఓ మహిళ పాత్రలో అనుష్కాశెట్టి కనిపిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత తన ఎదుగుదలను అడ్డుకున్నవారిపై ఆ మహిళ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది? ఈ క్రమంలో ఆమె క్రూరంగా ఓ క్రిమినల్‌గా ఎలా మారుతుంది? అన్నదే ‘ఘాటి’ చిత్రం కథాంశం అట.
బాలీవుడ్లో ఆలియాభట్‌తో సంజయ్‌లీలా భన్సాలీ తీసిన ‘గంగుభాయి కతియావాడి’ చిత్రంది కూడా కాస్త అటు ఇటుగా ఈ స్టోరీలైనే. మోసపోవడం,ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యంలో రాణిగా ఎదగడం…ఇదే బేసిక్ లైన్. మరి..అనుష్కాశెట్టి ‘ఘాటి’ స్టోరీ ఎలా ఉండబోతుంది? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.
SSRajamouli: చెట్టు ఆధారంగా సినిమా..పాకిస్తాన్లో దొరకని అనుమతులు
అయితే ‘ఘాటి’ చిత్రంలో ఆమె లుక్ మాత్రం చాలా కొత్తగా, రా అండ్ రస్టిక్‌గా ఉంటుందట. ఇంకో ఆసక్తికర విశేషం ఏంటంటే…‘ఘాటి’ చిత్రం అనుష్కాశెట్టి కెరీర్లో 50వ చిత్రం.