RajamouliSSMB29: దర్శకుడు రాజమౌళితో సినిమా అంటే అదో పెద్ద వ్యవహారం. సంవత్సరాలకు సంవత్సరాలు గడిచి పోతాయి (RajamouliSSMB29) . ‘బాహుబలి’ సినిమాల కోసం రాజమౌళి ఆరు సంవత్సరాలు కేటాయించారు. ఈ ఒక్క సినిమా కోసమే ప్రభాస్ ఐదేళ్లు వెచ్చించారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసమైతే ఎన్టీఆర్ నాలుగు సంవత్సరాలు. రామ్‌చరణ్ మూడు సంవత్సరాలు కేటాయించారు. కానీ తన తర్వాతి సినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తానని రాజమౌళి చెబుతుండటం హ్యాపీని పంచుతుంది ఆడియన్స్‌కు.
rajamouli: టాలీవుడ్లో రాజమౌళి హాలీవుడ్ ప్లాన్స్?
జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రదర్శన సందర్భంగా అక్కడికి వెళ్లారు రాజమౌళి. అక్కడ మహేశ్‌తో తాను చేయబోయే తరవాతి సినిమాను గురించి మాట్లాడారు. ‘‘నా తర్వాతి సినిమా మహేశ్‌బాబుతో ఉంటుంది. మహేశ్ అందగాడు. స్టోరీ రైటింగ్ పూర్తయింది. ప్రీ విజువలైనేషన్ వర్క్‌లో ఉన్నాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మహేశ్‌బాబు తప్ప, ఏ నటీనటులు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాం. రిలీజ్ సమయంలో మహేశ్‌బాబును ఇక్కడికి తీసుకువచ్చి మీకు(జపాన్ ప్రేక్షకులను ఉద్దేశించి) పరిచయం చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. అయితే రాజమౌళియే స్వయంగా సినిమాను త్వరగా పూర్తి చేస్తానడటం మహేశ్బాబుఫ్యాన్స్కు ఖుషీనిస్తోంది. చెప్పినట్లు నిజంగా మహేశ్‌బాబుతో సినిమాను రాజమౌళి త్వరిత గతిన పూర్తి చేస్తే మహేశ్‌బాబు కంటే లక్కీ పర్సన్ ఎవరు ఉండరెమో కదా.
ఆఫ్రికన్ ఫారెస్ట్స్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని ఈ చిత్రం కథా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2024
ఉగాదికి ప్రారంభించి, 2026 ఉగాదికి విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్ అని సమాచారం.