SSMB29: మహేశ్‌బాబు ఫ్యాన్స్ సూపర్ గుడ్‌న్యూస్. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమా పనులు చకా చకా జరుగుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసినట్లుగాఇప్పటికే దర్శక– రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. ఈ సినిమా అఫ్రికన్ ఫారెస్ట్స్ నేపథ్యంలోని అడ్వెంచరస్ మూవీగా ఉంటుందని ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి మరో సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను రాజమౌళి పూర్తి చేశారనితెలిసింది. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ భాగస్వామ్యులైయ్యేలా అమెరికాలోని ఓ ఏజెన్సీతోరాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్కోసం జర్మనీలో మహేశ్‌బాబు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇలా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగం
గా జరిగిపోతున్నాయి.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వివరాలు కూడా బహిర్గతమైయ్యాయి. ఈ ఏడాది ఉగాదికి ఈ సినిమాను ప్రకటించాలనుకుంటున్నారట రాజమౌళి. దాదాపు రెండు సంవత్సరాలు చిత్రీకరణ జరిపి,2026 ఉగాదికి విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్ అట. ఇక ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాలో మరో నిర్మాణసంస్థ భాగమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫారిన్ నిర్మాణసంస్థలతో పాటు, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు ఈ సినిమా ప్రొడక్షన్లో భాగమైయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాని వార్తలు వస్తున్నాయి. గతంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన చాలా సినిమాలను నిర్మించడంతో పాటుగా, మహేశ్నటించిన మరికొన్నిసినిమాలకు ‘దిల్’ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.