Mahesh Babu: మహేశ్‌బాబు ఇప్పటివరకు 28 సినిమాలు చేశారు. ఈ జాబితాలో త్రివిక్రమ్‌తో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ‘అతడు’, ‘ఖలేజా’, ఇటీవలి ‘గుంటూరుకారం’. అయితే తన ఫెవరేట్ మూవీస్‌లో త్రివిక్రమ్‌తో చేసిన ఏ సినిమాకు మహేశ్‌బాబు లిస్ట్‌లో చేర్చలేదు. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మహేశ్‌బాబు(Mahesh Babu) మాట్లాడారు. ఈ సంభాషణల్లో తన కెరీర్‌లోని మూడు సినిమాలనుఎంచుకోవాల్సినదిగా మహేశ్‌ను అడగ్గా, ‘మురారి’, ‘పోకిరి’, ‘శ్రీమంతుడు’ సినిమాలను ఎంచుకున్నారాయన. ఇలా త్రివిక్రమ్‌తో చేసిన సినిమాలను మహేశ్‌బాబు పక్కన పెట్టారు.
కృష్ణవంశీతో మహేశ్‌బాబు చేసిన ‘మురారి’ చిత్రం 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది. 2006లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మహేశ్ చేసిన ‘పోకిరి’ చిత్రం ఇండస్ట్రీహిట్గా నిలిచింది. ఇక కొరటాల శివతో మహేశ్చేసిన ‘శ్రీమంతుడు’ చిత్రం మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సమయంలో ఓ వైపు ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా ఆడుతున్న మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాసూపర్హిట్ మూవీగా నిలిచింది.
తన నెక్ట్స్ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో రూపొందనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని మహేశ్‌బాబు వెల్లడించారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఓ నిధి వేట ఈ సినిమాలోని ప్రధానాంశం అట. కీరవాణి సంగీత దర్శకులు. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రం చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. 2026లో ఈ సినిమాను విడుదల చేయాలను కుంటున్నారు.