rajamouli: మహేశ్‌బాబుతో రాజమౌళి (rajamouli)అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించాలనుకుంటున్నారు. అయితే సినిమా ప్రారంభించడానికి ముందు ఓ మీడియా సమావేశం నిర్వహించి, తన సినిమా వివరాలను క్లుప్తంగా చెప్పడం రాజమౌళి స్టైల్. ఈ సారి కూడా ఇలాంటి ప్లాన్ ఉంది రాజమౌళికి.అయితే ఈ లోపు ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నారు రాజమౌళి. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ ప్రక్రయలో భాగంగా హాలీవుడ్ యాక్టింగ్ ఎజెన్సీలతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రకారం హాలీవుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగమయ్యే చాన్సెస్ ఉన్నాయి. కాగా ఈ సినిమా ఓపెనింగ్‌కు హాలీవుడ్ ప్రముఖదర్శకులు జేమ్స్‌కామెరూన్, స్టీవెన్స్పిల్బర్గ్ వంటివారిని పిలవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.
ఇలా అయితే ఈ సినిమాకు ఓపెనింగ్ నుంచే హాలీవుడ్ మీడియా ఏట్రాక్షన్ ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారట. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్,గ్లోబల్ ప్రమోషన్స్‌లో భాగంగా జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్లను కలిసి, మాట్లాడారు రాజమౌళి. ఈ పరిచయం ఇలా ఏమైనా ఉపయోగపడుతుందెమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా కోసం మహేశ్‌బాబు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఓ నిధి అన్వేషణలో భాగంగా ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్గా ఇండోనేషియా బ్యూటీ చెల్సియాను అనుకుంటున్నారట రాజమౌళి. 2026లో ఈ సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. మరి..ఇవన్నీ జరుగుతాయా? వేచి చూడాలి.