హీరో రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సినిమా పనులు మెల్లిమెల్లిగా ఊపందుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీకపూర్, ఓ కీలక పాత్రకు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ కన్ఫార్మ్ అయ్యారు. డీవోపీగా రత్నవేలును తీసుకున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతోంది. మేలో ఈ సినిమాను చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి మరో అప్డేట్ రావొచ్చని చరణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ప్రధాన విలన్ పాత్రను బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
‘యానిమల్’ సినిమాలో స్క్రీన్‌పై కొంచెం సేపే ఉన్న ఆడియన్స్‌లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బాబీడియోల్. దీంతో టాలీవుడ్‌లోనూ బాబీ డియోల్‌ను వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆల్రెడీ సూర్య కంగువ చిత్రం లో విలన్‌గా నటిస్తున్నారు బాబీ డియోల్. ఇటీవల బాలకృష్ణ హీరోగా కేఎస్ రవీంద్ర డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్ సినిమాలోని విలన్ పాత్ర కోసం బాబీ డియోల్‌ను సంప్రదించిందట చిత్రంయూనిట్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి కొంత సమయం ఉంది. మరోవైపు సూర్య ‘కంగువ’ను కంప్లీట్ చేశారు బాబీడియోల్. బాలయ్యతో బాబీడియోల్ చేస్తున్న సినిమా చిత్రీకరణ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. ఈ తరుణంలో రామ్‌చరణ్ సినిమాకు
బాబీ డియోల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయనిపిస్తోంది. ఇక పవన్‌కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమాలో బాబీ డియోల్ ఓ పాత్ర చేయాల్సింది. అయితే ఈ సినిమా ప్రొగ్రెస్ స్లో గా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకున్నట్లుగా యానిమల్ ప్రమోషన్స్‌లో బాబీ డియోల్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.