Ramcharan RC16: హీరో రామ్‌చరణ్ (Ramcharan), దర్శకుడు బుచ్చిబాబు (Buchhibabu) కాంబినేషన్లో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా (RC16) రానుంది. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ది సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీస్ కిలారు నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వాస్తవానికి ఈ ఏడాది జనవరి చివరి భాగంలో ప్రారంభం కావాల్సింది. కానీ వాయిదా పడింది. దర్శకుడు శంకర్‌తో రామ్‌చరణ్ చేస్తున్న ‘గేమ్‌చేంజర్’ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది. మరోసారి గేమ్‌చేంజర్ కారణంగానే బుచ్చిబాబుతో రామ్‌చరణ్ చేయాల్సిన సినిమా వెనక్కి వెళ్లింది.
మార్చిలో ప్రారంభం అవుతుందున్న ఈ సినిమా చిత్రీకరణ మే నెలకు వాయిదా పడింది. వచ్చే నెలలో ఓ సెట్ వర్క్‌ను స్టార్ట్ చేస్తారు హైదరాబాద్‌లో ఇందుకు సంబంధించిన వర్క్్స మొదలైయ్యాయి. మేలో చిత్రీకరణను మొదలు పెడతారు. 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు ఈ సినిమాను. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ సినిమా కథనం స్పోర్ట్స్ డ్రామా. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో విజయనగరం, శ్రీకాకుళం నేపథ్యాల్లో ఉంటుంది. రామ్‌చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తారని, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ఓ కీ రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.