Ramcharan RC16: హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా (Ramcharan RC16) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఈ నెల 20న ప్రారంభించాలనే యోచనలో చిత్రంయూనిట్ ఉన్నారని తెలిసింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ వివిధ కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందీచిత్రం. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, సుకుమార్ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్లో రూపొందుతున్న 16వ సినిమా ఇది.
ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ ఈ సినిమాకు డైరెక్టర్. ‘గేమ్‌చేంజర్’ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ మార్చి 15, 2024న వైజాగ్‌లో ప్రారంభమైంది. రామ్‌చరణ్ పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారు మేకర్స్. ఓ ఐదు రోజులు ఈ సినిమాను ఇక్కడ జరపి, తిరిగి హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు మేకర్స్. ఇందులో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అంజలి, నవీన్‌చంద్ర, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ వంటివారు కీలక పాత్రధారులు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ ‘గేమ్‌చేంజర్’ సినిమా డిసెంబరులో విడుదల కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ రెండు సినిమాలను గురించి అప్డేట్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయి.