JanhvikapoorRise: రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ (JanhvikapoorRise) నటించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రానుంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీకపూర్‌ను తీసుకున్నారు మేకర్స్. మార్చి 6 జాన్వీకపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాంధ్రనేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ మే నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అన్నదమ్ముల ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ విని పిస్తోంది. 2026లో ఈ సినిమా విడుదల కావొచ్చు. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకటసతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక డైరెక్టర్.
తెలుగులో రెండోవ చిత్రం
ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘దేవర’ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా చేస్తున్నారు. ఇందులో తంగమ్ పాత్రలో జాన్వీకపూర్ కనిపిస్తారు. రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ సినిమా తొలిపార్టు అక్టోబరు 10న విడుదల కానుంది. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్‌తో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తీస్తున్నారు. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనిరు«ద్రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్
అల్లు అర్జున్ సినిమాలోనూ జాన్వీ?
‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా రెండో పార్టు ‘పుష్ప : దిరూల్’. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీమూవీ
మేకర్స్ నిర్మాతలు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ ఓ గెస్ట్ రోల్ చేయనున్నారని తెలిసింది. ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప : ది రైజ్’లో సమంత చేసినట్లుగా ఓ స్పెషల్‌సాంగ్‌లో జాన్వీ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ
చిత్రం ఆగస్టు 15న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
బాలీవుడ్లో జాన్వీ హవా!
బాలీవుడ్‌లోనూ జాన్వీకపూర్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ‘రుహీ’ తర్వాత హీరో రాజ్‌కుమార్‌రావుతో జాన్వీకపూర్ చేసిన క్రికెట్ స్పోర్ట్స్ డ్రామా ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. బవాల్ తర్వాత వరుణ్‌ధావన్‌తో ‘సన్నీ సంస్కారికీ తులసీ కుమారి’ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓమ్ ప్రకాశ్ మెహ్రా బాలీవుడ్లో తమిళ నటుడుతో ‘కర్ణ’ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీకపూర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.ఇలా ‘జాన్వీకపూర్’ కెరీర్ ప్రస్తుతం ఫుల్ రైజింగ్‌లో ఉందీప్పుడు. జాన్వీలైనప్ను చూస్తే ఒప్పుకోవాల్సిందేకదా.