Sunny Sanskari Ki Tulsi Kumari: హీరో వరుణ్‌ధావన్ (VarunDawan)- హీరోయిన్ ఆలియాభట్ (Aliabhat)- దర్శకుడు శశాంక్ కైతాన్ – నిర్మాత కరణ్‌జోహార్‌ల కాంబినేషన్ బాలీవుడ్లో సూపర్‌హిట్. ఈ కాంబోలో వచ్చిన ‘హమ్టీ శర్మకీ దుల్హనియా (2014), ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ (2017) సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్గా హీరో వరుణ్‌ధావన్- దర్శకుడు శశాంక్ కైతాన్ – నిర్మాత కరణ్‌జోహార్ కాంబినేషన్ రిపీటైంది ‘సన్నీ సంస్కారికీ తులసీ కుమారి’ సినిమా కోసం. కానీ హీరోయిన్ మాత్రం మారిపోయారు. ఆలియాభట్ ప్లేస్‌లో జాన్వీ కపూర్ (Janhvikapoor)వచ్చి చేరారు. ‘సన్నీ సంస్కారికీ తులసీ కుమారి’ సినిమా ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో థర్డ్ పార్టు అని బాలీవుడ్లో కూడా చెప్పుకుంటున్నారు. ఆలియా స్థానంలో జాన్వీకపూర్ చేరడం కూడా బీ టౌన్లో ప్రస్తుతం చర్చనీయాంశమే.’సన్నీ సంస్కారికీ తులసీ కుమారి’ సినిమా 2025 ఏప్రిల్‌లో విడుదల కానుంది.
ఇక ఈ సినిమా కంటే ముందు వరుణ్‌ధావన్, జాన్వీకపూర్‌లు కలిసి హిందీలో బవాల్ సినిమా చేశారు. 2023లో విడుదలైన ఈ సినిమా ఒకే అనిపించింది. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే..జాన్వీ తొలి సినిమా ‘థడక్’కు శశాంకే దర్శకుడు. కరణ్‌జోహార్ నిర్మాత. అలాగే కరణ్‌జోహార్ ‘ధర్మప్రొడక్షన్స్’లో జాన్వీ నాలుగైదు సినిమాలు కూడా ఆల్రెడీ చేశారన్న సంగతి తెలిసిందే.
ఇక జాన్వీకపూర్ హీరోయిన్గా ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ హీరో. రామ్‌చరణ్, సూర్య హీరోలుగా రానున్న కొత్త చిత్రాల్లో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తారు. జాన్వీ నటించిన రెండు హిందీ చిత్రాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇలా కెరీర్లో జాన్వీకపూర్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.