Venkatesh-Trisha: హీరో వెంకీ (Venkatesh), హీరోయిన్ త్రిష (Trisha) కాంబినేషన్ మరో రిపీట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007), ‘నమోః వెంకటేశాయ (2009), ‘బాడీగార్డు (2012)’ వంటి సినిమాల్లో కలిసి నటించారు హీరో వెంకటేష్, హీరోయిన్ త్రిష. మళ్లీ వీరిని జంటగా సిల్వర్‌స్క్రీన్‌పైకి తీసుకుని వచ్చే బాధ్యతను దర్శకుడు అనిల్‌రావిపూడి తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాల తర్వాత వెంకటేష్‌తో దర్శకుడు అనిల్‌రావిపూడి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తీస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘దిల్’ రాజు నిర్మాత అనే టాక్ తెరపైకి వచ్చింది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు త్రిషను సంప్రదించారట మేకర్స్. త్రిష కూడా సానుకూలంగానే స్పందించారట. త్వరలోనే ఈ చిత్రంపై ఓ క్లారిటీ రానుంది. ఒకవేళ వెంకీ-త్రిషల కాంబోఫిక్స్ అయితే దాదాపు పుష్కర కాలం(పన్నెండు సంవత్సరాలు) తర్వాత ఈ జోడీ రిపీట్ అవుతున్నట్లే. అన్నట్లు మరోమాట వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లోని ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్స్ రెడీ చేస్తున్నారట అనిల్‌రావిపూడి.