Meenakshi Chaudhary: ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్రావిపూడితో వెంకటేష్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షీ చౌదరి(Meenakshi Chaudhary) నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే విజయ్‌తో ‘ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, వరుణ్‌తేజ్‌తో ‘మట్కా’, విశ్వక్సేన్ పదవ చిత్రం, దుల్కర్సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ చిత్రాల్లో మీనాక్షీ హీరోయిన్గా నటిస్తున్నారు. లేటెస్ట్గా వెంకీ సరసన మీనాక్షీ అంటూ వార్తలు వస్తు న్నాయి. మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రంలోనూ మీనాక్షీ ఓ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కలిపితే మీనాక్షీ చౌదరి చేతిలో ఆరు సినిమాలు ఉన్నట్లు అవుతోంది. అంటే ప్రజెంట్ మీనాక్షీ కెరీర్లో సిక్సర్ కొట్టినట్లే లెక్క. వీటిలో మూడు సినిమాలు ఈ ఏడాదే విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
గత ఏడాది మీనాక్షీ నటించిన ఒక్క తెలుగు చిత్రం కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది ఒక్కసారిగా ఇన్ని చిత్రాలు రావడం విశేషం. ‘గుంటూరుకారం’ సినిమాలో మీనాక్షికి చాన్స్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఆమెకు మంచి అవకాశాలు క్యూ కట్టాయి. ‘గుంటూరుకారం’ సినిమాలో మీనాక్షీ తొలుత హీరోయిన్ కాదు.
గుంటూరు కారం సినిమాలోని మెయిన్ హీరోయిన్గా పూజాహెగ్డేను, సెకండ్ లీడ్ హీరోయిన్గా శ్రీలీలను తీసుకున్నారు మేకర్స్. కొంత షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇంతలో పూజాహెగ్డే ‘గుంటూరుకారం’ నుంచి తప్పుకున్నారు. దీంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ని చేసి, మీనాక్షీ చౌదరిని సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ చేశారు ఈ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్. మహేశ్‌బాబు సినిమాలో ఓ హీరోయిన్ అనగానే మీనాక్షీకి మిగత సినిమా దర్శక–నిర్మాతలు మంచి అవకాశాలు కల్పించారు. మీనాక్షీ కూడా చక చక్క సైన్లు చేశారు. గుంటూరుకారం సినిమా హిట్ కాలేదు కానీ ఈ సినిమా పుణ్యమా అని మీనాక్షీ చౌదరి కెరీర్ ప్రస్తుతం హిట్ టాక్‌తో నడుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే…‘గుంటూరుకారం’ సినిమాలో మీనాక్షికి పెద్ద మంచి రోల్ ఏం దక్కలేదు. జస్ట్ ఈ సినిమాలో చాన్స్ వల్ల ఇతర సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అంతే.