Viswambhara Release: రంగంలోకి దిగాడు విశ్వంభర. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకుడు. భారీ బడ్జెట్‌తో పంచభూతాలు(గాలి, నీరు, ఆకాశం, నేల, అగ్ని) నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో భీమవరం దొర బాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లుగా తెలిసింది. మేజర్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది.
ఇందుకోసం పదికిపైగా సెట్స్ వేశారు మేకర్స్. కాగా ఈ సినిమా సెట్స్‌లోకి చిరంజీవి ఎంట్రీ అయ్యారు. అలాగే ‘విశ్వంభర’ సినిమాను జనవరి 10, 2025న విడుదల చేస్తున్నట్లుగా చిత్రంయూనిట్ ప్రకటించింది. అయితే గత మూడు సంవత్సరాలుగా తొలుత సంక్రాంతి రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఏ సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు. మరి..ఈ రికార్డును ‘విశ్వంభర’ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.