F4movie: హీరో వెంకటేష్ – దర్శకుడు అనిల్‌రావిపూడి– నిర్మాత ‘దిల్’ రాజు కాంబినేషన్లోని ‘ఎఫ్ 2’ చిత్రం బ్లాక్‌బస్టర్. ఇందులో వరుణ్‌తేజ్ ఓ లీడ్ రోల్ చేశారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత సేమ్ కాంబినేషన్లో ‘ఎఫ్ 3’ వచ్చి, ఫర్వాలేదనిపించుకుంది. 2022 మేలో ఈ సినిమాను విడుదలైంది. కానీ ‘ఎఫ్ 3’ సినిమాను ముందుగా సంక్రాంతి రిలీజ్‌కే ప్రకటించారు ‘దిల్’ రాజు. కానీ అప్పటి రిలీజ్ సమీకరణాల దృష్ట్యా ‘ఎఫ్ 3’ వేసవికి వాయిదా పడింది. అయితే తాజాగా వెంకటేష్– అనిల్‌రావిపూడి– ‘దిల్’ రాజు కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అదీ కూడ ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం వెంకీ సోలో హీరోగా ఉంటుందా? లేక వెంకటేష్–వరుణ్‌తేజ్‌ల కాంబినేషన్లోని ‘ఎఫ్ 4’ చిత్రమా? అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ‘సైంధవ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న వెంకటేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ‘నా కెరీర్లో డిఫరెంట్ రోల్స్ చేశాను. వాటిలో యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ..ఇలా విభిన్న రకాలు సినిమాలు చేశాను. ఇప్పుడు ‘సైంథవ్’లాంటి యాక్షన్ ఫిల్మ్ చేశాను. నెక్ట్స్ అనిల్‌తో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 4’ తరహా సినిమాలు చేయవచ్చు’ అంటూ హింట్ ఇచ్చారు. ‘ఎఫ్ 4’ సినిమాను దృష్టిలో పెట్టుకునే వెంకీ ఈ కామెంట్ చేశారని ఊహిస్తున్నారు కొందరు గ్యాసిప్ రాయళ్లు. ఇక ‘ఎఫ్ 3’ సినిమా ఎండింగ్లో ‘ఎఫ్ 4’ ఉంటుందని, గోవా నేపథ్యంలో ఉండొచ్చని అనిల్‌రావిపూడి క్లిప్ హ్యాంగర్‌గా చెప్పిన విషయం తెలిసిందే. ఇక ‘దిల్’ రాజుతో ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎప్ 2’, ‘సరిలేరునీకెవ్వరు’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు చేశారు దర్శకుడు అనిల్‌రావిపూడి. ‘దిల్’ రాజుతో అనిల్‌రావిపూడికి ఇది ఆరో చిత్రం అవుతుంది.