Thamizhagavetrikazhagam: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయపార్టీని స్టార్ట్ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలే నిజం అయ్యాయి. తాను రాజకీయ పార్టీని పెడుతున్న విషయాన్ని విజయ్ శుక్రవారం అంటే ఫిబ్రవరి 02, 2024న అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి తమిళగ వెట్రి కళగం( Thamizhagavetrikazhagam) పేరును ఖరారు చేశారు. ఇక “విజయ్ పీపుల్స్ మూవ్మెంట్” అనేక సంవత్సరాలుగా తన శక్తి మేరకు అనేక సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు మరియు సహాయ సహకారాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే.
‘‘2024 పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మేం పాల్గొనడం లేదు. అలాగే మేం ఏ రాజకీయపార్టీకి సపోర్ట్ చేయడమూ లేదు. . పూర్తిస్థాయిలో రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాను. రాజకీయ అంశాలతో మరోక పొలిటికల్ సినిమాకు కమిటైయ్యాను’’ అంటూ విజయ్ ఓ నోట్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే సినిమా చేస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకుడు. ఏజీఎస్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా వారి బ్యానర్లో 25వ సినిమాగా తీస్తోంది. ఈ చిత్రం ఏడాది విడుదల కానుంది. ఇక విజయ్ చివరి చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతుంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
రాజకీయపార్టీలను స్థాపించిన తమిళనాడు సినీనటీనటుల్లో కరుణానిధి, జయలలిత వంటివారు సక్సెస్ కాగా, రజనీకాంత్, విజయ్‌కాంత్, కమల్‌హాసన్ అంతగా ప్రభావం చూపలేకపోయారు. రజనీకాంత్ అయితే ఓ పొలిటికల్ పార్టీని పెట్టి ఆ తర్వాత, తన అనారోగ్య కారణాల చేత క్యాన్సిల్ చేశారు. మరి..
విజయ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.